Balkampet ఎల్లమ్మ ఆలయ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

ABN , First Publish Date - 2022-07-05T14:41:58+05:30 IST

బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం సందర్భంగా ఆలయ పరిసరాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

Balkampet ఎల్లమ్మ ఆలయ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్: బల్కంపేట (Balkampet) ఎల్లమ్మ కల్యాణం సందర్భంగా ఆలయ పరిసరాల్లో పోలీసులు (Police) ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈరోజు అమ్మవారి కల్యాణం, బుధవారం రథోత్సవం సందర్భంగా వాహనదారులు ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్లాలని తెలిపారు. మరోవైపు ఎల్లమ్మ కళ్యాణం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి మంత్రులు తలసాని (Talasani), ఇంద్రకరణ్ రెడ్డి (Indrakaran reddy) పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. కళ్యాణానికి లక్షలాదిగా భక్తులు తరలిరానున్నారు. ఎల్లమ్మ కళ్యాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేసింది. 


వాహనాల మళ్లింపు...

* గ్రీన్ ల్యాండ్స్, దుర్గామాత టెంపుల్, సత్యం థియేటర్ వైపు నుంచి ఫతేనగర్ వైపు వెళ్లే వాహనాలు ఎస్ఆర్ నగర్ టీ జంక్షన్ నుంచి ఎస్ఆర్ నగర్ కమ్యూనిటీ హాల్, అభిలాష టవర్స్, బీకేగూడ ఎక్స్ రోడ్డు, శ్రీరామనగర్ ఎక్స్ రోడ్డు, సనత్నగర్ రోడ్డు మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. 

ఫతేనగర్ వైపు నుంచి బల్కంపేట వైపు వచ్చే వాహనాలు బల్కంపేట వైపు  అనుమతించరు. వాహనదారులు బల్కంపేట-బేగంపేట లింక్ రోడ్డులోకి మళ్లించి కట్టమైసమ్మ టెంపుల్ వైపు వెళ్లాల్సి ఉంటుంది. 

గ్రీన్ ల్యాండ్స్ బకుల్ అపార్ట్మెంట్స్, ఫుడ్ వరల్డ్ వైపు నుంచి వచ్చే వాహనాలను బల్కంపేట వైపు అనుమతించరు. వాహనదారులు ఫుడ్ వరల్డ్ ఎక్స్ రోడ్డు నుంచి సోనాబాయి టెంపుల్, సత్యం థియేటర్, మైత్రివనం, ఎస్ఆర్ నగర్ టీ జంక్షన్ వైపు వెళ్లాల్సి ఉంటంది.

ఎస్సార్ నగర్ టీ జంక్షన్ నుంచి ఫతేగర్ వైపు వెళ్లే బై-లేన్స్, లింక్ రోడ్లను మూసివేశారు.

Updated Date - 2022-07-05T14:41:58+05:30 IST