స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణ

ABN , First Publish Date - 2022-08-15T05:01:06+05:30 IST

పట్టణంలోని జిల్లా పోలీసు కార్యాలయం పేరెడ్‌ గ్రౌండ్‌లో మొట్టమొదటిసారిగా జరగనున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు పలువురు హాజరవుతున్న దృష్ట్యా ఎస్పీ ఆదేశాల మేరకు ట్రాఫిక్‌ను క్రమబద్ధీ కరించినట్లు పోలీసులు తెలిపారు. అన్నమయ్య జిల్లాకు చెందిన స్వాతంత్ర సమరయోధులు, జిల్లా ఉన్నతాధికారులు, పురప్రముఖులు, నాయకులు, ప్రజలు, ఉపాధ్యాయులు, విద్యార్థినీ, విద్యార్థులు, జిల్లాకు చెందిన అన్నిశాఖాధిపతులు, పురస్కార గ్రహీతలు రానున్నారు.

స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణ

రాయచోటిటౌన్‌, ఆగస్టు 14: పట్టణంలోని జిల్లా పోలీసు కార్యాలయం పేరెడ్‌ గ్రౌండ్‌లో మొట్టమొదటిసారిగా జరగనున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు పలువురు హాజరవుతున్న దృష్ట్యా ఎస్పీ ఆదేశాల మేరకు ట్రాఫిక్‌ను క్రమబద్ధీ కరించినట్లు పోలీసులు తెలిపారు. అన్నమయ్య జిల్లాకు చెందిన స్వాతంత్ర సమరయోధులు, జిల్లా ఉన్నతాధికారులు, పురప్రముఖులు, నాయకులు, ప్రజలు, ఉపాధ్యాయులు, విద్యార్థినీ, విద్యార్థులు, జిల్లాకు చెందిన అన్నిశాఖాధిపతులు, పురస్కార గ్రహీతలు రానున్నారు. ఇందులో భాగంగా లక్కిరెడ్డిపల్లె జంక్షన్‌ నుంచి వచ్చే వాహనాలు మాసాపేట వైజంక్షన్‌ మీదుగా కడప రింగురోడ్డు జంక్షన్‌కు చేరాల్సి ఉంటుందన్నారు. అలాగే చిత్తూరు రింగు రోడ్డు జంక్షన్‌ నుంచి మదనపల్లె రింగురోడ్డు జంక్షన్‌కు, కడప వైపు వెళ్లే భారీ, మధ్య తరహా వాహనాలన్నీ చిత్తూరు రింగురోడ్డు జంక్షన్‌ నుంచి గున్నికుంట్ల రింగు రోడ్డు జంక్షన్‌, చెన్నముక్కపల్లె, వీరబల్లి రింగు రోడ్డు జంక్షన్‌ మీదుగా కడప రింగు రోడ్డు జంక్షన్‌కు చేరాలని సూచించారు. అలాగే చిత్తూరు రింగురోడ్డు జంక్షన్‌, చిన్నమండెం రింగురోడ్డు జంక్షన్ల వద్ద నుంచి గాలివీడు రోడ్డు, లక్కిరెడ్డిపల్లె వైపు వెళ్లే వాహనాలకు ఎటువంటి ఆంక్షలు లేవన్నారు. అలాగే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు హాజరయ్యే వీఐపీలకు పేరెడ్‌ గ్రౌండ్‌లో, జిల్లా అధికారులకు పాలిటెక్నికల్‌ కళాశాల ముందు భాగాన, పబ్లిక్‌ బస్సులు, కార్లకు బస్టాప్‌ పక్కన ఉన్న ప్రదేశంలో పార్కింగ్‌ చేయాలని డీఎస్పీ శ్రీధర్‌ తెలియజేశారు. వాహనదారులు ఈ విషయాన్ని గమనించాలన్నారు. 

Updated Date - 2022-08-15T05:01:06+05:30 IST