ఎమ్మెల్యే నాని పాదయాత్రలో ప్రజలకు ట్రాఫిక్‌ కష్టాలు

ABN , First Publish Date - 2022-08-16T05:30:00+05:30 IST

ఫైర్‌స్టేషన్‌ సెంటర్‌ నుంచి పోలీస్‌ కల్యాణమండపం వరకూ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం సందర్భంగా ట్రాఫిక్‌ అంతరాయం కలిగింది.

ఎమ్మెల్యే నాని పాదయాత్రలో ప్రజలకు ట్రాఫిక్‌ కష్టాలు

ఏలూరు కలెక్టరేట్‌, ఆగస్టు 16: స్థానిక 32వ డివిజన్‌ కోర్టు సెంటర్‌ నుంచి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ళ నాని మంగళవారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్ళి మూడేళ్ళ కాలంలో ప్రజ లకు సంక్షేమ పథకాల లబ్ధి గురించి వివరించారు. అనంతరం 31వ డివిజన్‌లోని ఫారెస్టు ఆఫీస్‌ మీదుగా కార్యక్రమం సాగింది. 

 పాదయాత్రతో ట్రాఫిక్‌ కష్టాలు 

స్థానిక ఫైర్‌స్టేషన్‌ సెంటర్‌ నుంచి పోలీస్‌ కల్యాణమండపం వరకూ గడప గడపకు మన ప్రభుత్వం  కార్యక్రమం సందర్భంగా ట్రాఫిక్‌ అంతరాయం కలిగింది. రోడ్డుకు ఎడమ పక్కన నివాసాలకు వెళ్ళి ప్రచారం చేస్తుండగా కాన్వాయ్‌ వాహనాలన్నీ రోడ్డు పక్కన నిలిపి ఉండడంతో డివైడర్‌ ఇరు వైపులా వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కల్గింది. ట్రాఫిక్‌ పోలీసు లు వన్‌వే ద్వారా వాహనాలకు అనుమతి ఇవ్వడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆర్టీసీ బస్సుసైతం వన్‌వేలో ఇరుక్కుపోవడంతో అటు ఇటుగా వెళ్తున్న వాహనదారులు ట్రాఫిక్‌ కష్టాలు ఎదుర్కొన్నారు.

కొయ్యలగూడెం: కుంతలగూడెం, కనకాద్రిపురం గ్రామాల్లో ఎమ్మెల్యే బాలరాజు గడపగడపకు పాదయాత్ర నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ రామారావు, గొడ్డాటి నాగేశ్వరరావు, మాజీ ఎంపీపీ మట్టా సత్తిపండు, గ్రామ వైసీపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు. 

భీమడోలు: గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మండలంలోని కురెళ్ళగూడెం, దుద్దేపూడి గ్రామాల్లో ఎమ్మెల్యే వాసుబాబు పర్యటించారు. సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. 

సమస్యలు పరిష్కరించాలని మొర

ద్వారకాతిరుమల, ఆగస్టు 16: మా గ్రామాన్ని ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టిం చుకోవడం లేదని వేంపాడు గ్రామస్థులు ఎంపీ, ఎమ్మెల్యే ఎదుట మొర పెట్టుకున్నారు. మంగళవారం ఈ గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజమహేం ద్రవరం ఎంపీ మార్గా ని భరత్‌ రామ్‌, ఎమ్మెల్యే తలారి వెంకట్రావు హాజర య్యారు. గ్రామస్థులు మాట్లాడుతూ ప్రధానంగా కనీస సౌకర్యాలైన సీసీ రోడ్లు, పారిశుధ్యం, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నాయని తెలిపారు. తక్షణమే సమస్యలు పరిష్కరిచాలని అధికారులకు ఆదేశాలిచ్చారు.


Updated Date - 2022-08-16T05:30:00+05:30 IST