Jr NTR కారును ఆపిన ట్రాఫిక్ పోలీసులు.. ఆ సమయంలో..!

ABN , First Publish Date - 2022-03-21T15:03:51+05:30 IST

Jr NTR కారును ఆపిన ట్రాఫిక్ పోలీసులు.. ఆ సమయంలో..!

Jr NTR కారును ఆపిన ట్రాఫిక్ పోలీసులు.. ఆ సమయంలో..!
FILE PHOTO

  • స్పెషల్‌ డ్రైవ్‌లో బ్లాక్‌ ఫిలింలు తొలగింపు
  • పలువురికి జరిమానాలు

హైదరాబాద్ సిటీ/బంజారాహిల్స్‌/ఖైరతాబాద్‌ : బ్లాక్‌ ఫిలింతో, ఎమ్మెల్యే స్టిక్కర్‌లతో తిరుగుతున్న వాహనాలపై సైఫాబాద్‌, జూబ్లీహిల్స్‌ ట్రాఫిక్‌ పోలీసులు కొరడా ఝళిపించారు. ఖైరతాబాద్‌ పరిధిలోని ఇందిరాగాంధీ చౌరస్తా, జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు, ఫిలింనగర్‌ చౌరస్తా తదితర ప్రాంతాల్లో ఆదివారం స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించారు. మూడు ఇన్నోవా కార్లకు ఏపీకి చెందిన ఎమ్మెల్యేల స్టిక్కర్లు ఉండటంతో వాటిని తొలగించారు. సినీ నటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌కు చెందిన కారుకు బ్లాక్‌ ఫిలిం ఉండటంతో దాన్ని తీయించివేశారు. ఆ సమయంలో కారులో ఎన్టీఆర్‌ లేరు. డ్రైవర్‌ మాత్రమే ఉన్నాడు. మొత్తం 90 వాహనాలకు బ్లాక్‌ ఫిలింను తొలగించి పలువురికి జరిమానాలు విధించినట్లు సైఫాబాద్‌ ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ రాంచందర్‌, జూబ్లీహిల్స్‌ సీఐ ముత్తు తెలిపారు. 





Updated Date - 2022-03-21T15:03:51+05:30 IST