గోవాడలో ట్రాఫిక్‌ జామ్‌

ABN , First Publish Date - 2021-01-19T06:22:08+05:30 IST

మండలంలోని గోవాడ ప్రధాన రహదారిపై సోమవారం ట్రాఫిక్‌ స్తంభించిపోయింది.

గోవాడలో ట్రాఫిక్‌ జామ్‌
చోడవరం-అనకాపల్లి రూటులో నిలిచిన వాహనాలు

భారీగా నిలిచిపోయిన వాహనాలు

ప్రయాణికుల, వాహనదారుల ఇక్కట్లు


చోడవరం, జనవరి 18: మండలంలోని గోవాడ ప్రధాన రహదారిపై సోమవారం ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. గోవాడ-అంభేరుపురం కూడలిలోని మలుపులో ఆర్టీసీ బస్సు నిలిచిపోవడంతో చోడవరం-విశాఖ, చోడవరం-అనకాపల్లి రూట్లలో భారీగా వాహనాలు స్తంభించిపోయాయి. సుమారు రెండు గంటల పాటు ట్రాఫిక్‌ అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రయాణికులు, వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పోలీసులు చేరుకుని ట్రాఫిక్‌ను క్లియర్‌ చేయడంతో వాహనాలు కదిలాయి. కాగా, ఇటీవల ఈ రూటులో తరచూ ట్రాఫిక్‌ సమస్య ఉత్పన్నమవుతోంది. ఈ సమస్యను పరిష్కరించాలని వాహన చోదకులు విజ్ఞప్తి చేస్తున్నారు. 

Updated Date - 2021-01-19T06:22:08+05:30 IST