అచ్యుతాపురం జంక్షన్‌లో ట్రాఫిక్‌ జామ్‌

ABN , First Publish Date - 2021-03-05T06:32:21+05:30 IST

మండల కేంద్రం అచ్యుతాపురం జంక్షన్‌లో గురువారం సుమారు గంట పాటు ట్రాఫిక్‌ స్తంభించిపోయింది.

అచ్యుతాపురం జంక్షన్‌లో ట్రాఫిక్‌ జామ్‌
అచ్యుతాపురం జంక్షన్‌లో నిలిచిన భారీ వాహనాలు


 కర్మాగారాలకు భారీ యంత్ర సామగ్రితో రెండు వాహనాలు రాక

 జంక్షన్‌లో మలుపు తిప్పేందుకు తీవ్ర ఇబ్బందులు

 గంటపాటు నలువైపులా నిచిలిన వాహనాలు

అచ్యుతాపురం, మార్చి 4: మండల కేంద్రం అచ్యుతాపురం జంక్షన్‌లో గురువారం సుమారు గంట పాటు ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. సెజ్‌లోని కర్మాగారాలకు భారీ యంత్ర సామగ్రితో రెండు వాహనాలు వచ్చాయి. రోడ్డు ఇరుకుగా ఉండడంతో అచ్యుతాపురం జంక్షన్‌లో వాహనాలు మలుపు తిప్పేందుకు డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డాల్సి వచ్చింది.  దీంతో జంక్షన్‌ నాలుగు వైపులా కిలో మీటరు పొడవున వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు శ్రమిమించి ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు.

Updated Date - 2021-03-05T06:32:21+05:30 IST