Hyderabad: నిజాయితీ చాటుకున్న ట్రాఫిక్‌ హోంగార్డు..

ABN , First Publish Date - 2022-10-07T14:09:42+05:30 IST

యువతి పోగొట్టుకున్న పర్సును ట్రాఫిక్‌ హోంగార్డు ఆమెకు అప్పగించారు. ఒడిశాకు చెందిన నిఖిత సాహు బస్సులో

Hyderabad: నిజాయితీ చాటుకున్న ట్రాఫిక్‌ హోంగార్డు..

హైదరాబాద్/ఖైరతాబాద్‌: యువతి పోగొట్టుకున్న పర్సును ట్రాఫిక్‌ హోంగార్డు ఆమెకు అప్పగించారు. ఒడిశాకు చెందిన నిఖిత సాహు బస్సులో ప్రయాణిస్తూ పర్సును రవీంద్రభారతి కూడలి వద్ద పోగొట్టుకుంది. గమనించిన పాదచారులు అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్‌ హోంగార్డు వెంకటేశ్వర్లుకు అప్పగించారు. పర్సులో నగదు, బ్యాంక్‌ ఏటీఎం కార్డు ఉన్నాయి. దాని ఆధారంగా బ్యాంక్‌కు వెళ్లి ఖాతా ద్వారా ఫోన్‌ నెంబర్‌ సేకరించి పర్సును ఆమెకు అందజేశాడు. అధికారులను హోంగార్డును అభినందించారు. 

Updated Date - 2022-10-07T14:09:42+05:30 IST