Viral Video: నడిరోడ్డుపై ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్ చేసిన పనికి అందరూ ఫిదా..

ABN , First Publish Date - 2022-06-19T02:33:30+05:30 IST

ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి అవనీశ్ శరణ్ తరచుగా తన సోషల్ మీడియా ఖాతాల్లో స్ఫూర్తివంతమైన వీడియోలు షేర్ చేస్తుంటారు.

Viral Video: నడిరోడ్డుపై ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్ చేసిన పనికి అందరూ ఫిదా..

ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి అవనీశ్ శరణ్ తరచుగా తన సోషల్ మీడియా ఖాతాల్లో స్ఫూర్తివంతమైన వీడియోలు షేర్ చేస్తుంటారు. ఇటీవల ఆయన ట్విటర్‌లో షేర్ చేసిన ఐఏఎస్ అధికారి పదో తరగతి మార్కుల జాబితా సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన షేర్ చేసిన మరో వీడియో కూడా నెటిజన్ల ప్రశంసలు అందుకుంటోంది. 


ఇది కూడా చదవండి..

Viral Video: Amazon లో కుర్చీని ఆర్డర్ చేసిన మహిళ.. పార్శిల్‌ను ఓపెన్ చేసి చూస్తే కుర్చీతో పాటు లోపల కనిపించిన దాన్ని చూసి..


ఆ వీడియో ప్రకారం.. ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ రోడ్డుపై ఉన్న కంకర రాళ్లను చీపురుతో తుడుస్తున్నాడు. కంకర రాళ్ల మీద బైక్‌లు వెళితే స్కిడ్ అయి పడిపోయే ప్రమాదం ఉంది. అందుకని ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్ స్వయంగా ఆ కంకర రాళ్లను చీపురుతో ఊడ్చాడు. ఆ ఘటనను అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. 

Updated Date - 2022-06-19T02:33:30+05:30 IST