Chhattisgarh Cop: కానిస్టేబుల్ నిజాయితీపై ప్రశంసలు.. ఇంతకీ అతను ఏం చేశాడంటే..

ABN , First Publish Date - 2022-07-24T21:16:26+05:30 IST

ఎవరికైనా రోడ్డుపై డబ్బులు దొరికితే ఏం చేస్తారు? వెంటనే తీసుకుని జేబులో వేసుకుంటారు. ఇక, డబ్బు కట్టలతో ఉన్న బ్యాగ్ దొరికితే..

Chhattisgarh Cop: కానిస్టేబుల్ నిజాయితీపై ప్రశంసలు.. ఇంతకీ అతను ఏం చేశాడంటే..

ఎవరికైనా రోడ్డుపై డబ్బులు దొరికితే ఏం చేస్తారు? వెంటనే తీసుకుని జేబులో వేసుకుంటారు. ఇక, డబ్బు కట్టలతో ఉన్న బ్యాగ్ దొరికితే.. గుట్టు చప్పుడు కాకుండా స్వాధీనం చేసుకుంటారు. అయితే ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh)కు చెందిన ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ అలా చేయలేదు. తనకు దొరికిన బ్యాగ్‌ను ఎంతో నిజాయితీతో తిరిగి ఇచ్చేశాడు.  ఛత్తీస్‌గడ్‌కు చెందిన ఓ ట్రాఫిక్‌ కానిస్టేబుల్ (traffic constable) రోడ్డుపై తనకు దొరికిన రూ.45లక్షలను పోలీసులకు అప్పగించాడు. అతడి నిజాయితీపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. 



Missing Parrot Found: తప్పిపోయిన చిలుకను పట్టి అప్పగించాడు.. ఏకంగా రూ.85 వేల నజరానా అందుకున్నాడు!


ఛత్తీస్‌గఢ్‌ రాజధాని రాయ్‌పుర్‌లోని కయబంధా పోస్ట్‌లో నిలాంబర్‌ సిన్హా అనే వ్యక్తి ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌‌గా పని చేస్తున్నాడు. గురువారం తెల్లవారు జామున డ్యూటీలో ఉండగా మనా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఉన్న రోడ్డుపై ఓ బ్యాగు చూశాడు. దానిని తెరిచి చూడగా లోపల నోట్ల కట్టలు కనిపించాయి. మొత్తం రూ.2వేలు, రూ.500 నోట్ల కట్టలు ఉన్నాయి. సుమారు రూ.45 లక్షలు ఉంటాయి. వెంటనే నీలాంబర్ ఉన్నతాధికారులకు సమాచారం అందించాడు. ఆ తర్వాత సివిల్‌ లైన్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో బ్యాగ్‌ను అప్పగించాడు. 


నోట్ల కట్టల బ‍్యాగును తిరిగి ఇచ్చేసి తన నిజాయితీని చాటుకున్న ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ నిలాంబర్‌‌ను పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు. ఎంతో నిజాయితీగా ప్రవర్తించిన నిలాంబర్‌‌కు రివార్డు ప్రకటించారు. కాగా, ఆ బ్యాగు ఎవరిదనే విషయాన్ని తేల్చే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.

Updated Date - 2022-07-24T21:16:26+05:30 IST