సంప్రదాయాలను కాపాడాలి

ABN , First Publish Date - 2020-09-24T08:03:57+05:30 IST

రాష్ట్రంలో సంప్రదాయాలు, ఆచారాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని మాజీ ఎమ్మెల్యే వనమాడి

సంప్రదాయాలను కాపాడాలి

మాజీ ఎమ్మెల్యే వనమాడి  సీఎం కార్యాలయానికి  లేఖలు 


డెయిరీఫారమ్‌ సెంటర్‌ (కాకినాడ), సెప్టెంబరు 23: రాష్ట్రంలో సంప్రదాయాలు, ఆచారాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అన్నారు. జగన్నాథపురంలోని కొండబాబు నివాసం వద్ద బుధవారం హిందూ సంప్రదాయాలను కాపాడాలని కోరుతూ టీడీపీ శ్రేణులు సీఎం కార్యాలయానికి  లేఖలు రాశారు. అనంతరం వనమాడి మాట్లాడుతూ అన్యమతస్థులు ఎవరైనా తిరుమల స్వామివారిని దర్శించుకోవాలంటే డిక్లరేషన్‌ ఫారం ఇవ్వాల్సిందేనన్నారు. కార్యక్రమంలో నృశింహదేవర విశ్వనాథం, చింతపల్లి కాశి, తుమ్మల రమేష్‌, వొమ్మి బాలాజీ, గదుల సాయిబాబా, బంగారు సత్యనారాయణ, గుజ్జు బాబు, చింతలపూడి రవి, జోగా రాజు, అద్దేపల్లి గంగరాజు, హోతా రవి పాల్గొన్నారు. 


డిక్లరేషన్‌ ఇవ్వాలి 

పిఠాపురం: తిరుమల వెంకటేశ్వరస్వామి దర్శనానికి సీఎం జగన్‌ డిక్లరేషన్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎ్‌సఎన్‌వర్మ ఆధ్వర్యంలో పిఠాపురంలో టీడీపీ నాయకు లు, కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. సీఎం కార్యాలయానికి లేఖలు పంపారు. తిరుమలలో ఆచారాన్ని జగన్‌ గౌరవించాలని వర్మ సూచించారు. ఆందోళనలో నాయకులు రెడ్డెం భాస్కరరావు, కరణం చిన్నారావు, దేవరపల్లి రామారావు, కొండేపూడి ప్రకాష్‌, సకుమళ్ల గంగాధర్‌, నల్లాశ్రీను పాల్గొన్నారు.


పోరాటం సాగిస్తాం

కోటనందూరు: దేవాలయాలపై దాడులు అరికట్టే వరకు పోరాటం సాగిస్తామని టీడీపీ మండలాధ్యక్షుడు గాడి రాజుబాబు అన్నారు. దేవాలయాలపై దాడులు నిరసనగా కోటనందూరులో టీడీపీ నాయకులు సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా రాజుబాబు మాట్లా డుతూ రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాలపై వరుస దాడులు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. మాజీ సర్పంచ్‌లు యర్ర చినసత్యనారాయణ, బోడపాటి సత్యనారాయణ, అంకంరెడ్డి రమేష్‌, ఎల్‌.భాస్కర్‌రావు, మాతిరెడ్డి భాస్కర్‌రావు పాల్గొన్నారు.

Updated Date - 2020-09-24T08:03:57+05:30 IST