Abn logo
Mar 5 2021 @ 00:07AM

సంప్రదాయబద్ధంగా బండారీ కార్యక్రమం

బజార్‌హత్నూర్‌, మార్చి 4: మండలంలోని ఏపాపూర్‌ గ్రామంలో మతుర కులస్తులు సంప్రదాయబద్ధంగా బండారీ కార్యక్రమం నిర్వహించారు. గురువారం ఎంపీ సోయం బాపూరావుతోపాటు బోథ్‌ ఎమ్మెల్యే రాథోడ్‌ బాపూరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంస్కృతి, సంప్రదాయాలను పాటిస్తూ భావితరాలకు వాటి విశిష్ఠతను చాటిచెప్పేందుకు కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement