లక్ష్మీనరసింహుడికి సంప్రదాయ పూజలు

ABN , First Publish Date - 2022-05-20T05:45:55+05:30 IST

స్వ యంభు పాంచనారసంహుడు కొలువుదీరిన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో గురువారం నిత్య పూజాకైంకర్యా లు సంప్రదాయరీతిలో కొనసాగా యి.

లక్ష్మీనరసింహుడికి సంప్రదాయ పూజలు
అలంకార వెండి జోడు సేవోత్సవం నిర్వహిస్తున్న అర్చకులు

యాదాద్రీశుడిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు


యాదగిరిగుట్ట, మే 19: స్వ యంభు పాంచనారసంహుడు కొలువుదీరిన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో గురువారం నిత్య పూజాకైంకర్యా లు సంప్రదాయరీతిలో కొనసాగా యి. ప్రధానాలయంలో మూలవరులకు శ్రీవైష్ణవ ఆచారపరం గా, కొండపైన రామలింగేశ్వరుడికి శైవాగమ పద్ధతిలో నిత్యారాధన లు నిర్వహించారు. సుప్రభాతంతో స్వామిని మేల్కొలిపిన ఆచార్యు లు నిజాభిషేకం, నిత్యార్చనలు చేశారు. ముఖమండపంలో సువర్ణ పుష్పార్చనలు, అష్టోత్తరాలు కొనసాగా యి. పడమటి నైరుతి దిశలోని ఆలయ అష్టభుజి ప్రాకార మండపంలో సుదర్శన హోమం, నిత్యతిరుకల్యాణపర్వాలు ఆగమ శాస్త్రరీతిలో కొనసాగాయి. అనుబంధ రామలింగేశ్వరస్వామికి, ముఖమండపంలోని స్పటి క రామలింగేశ్వరుడిని నమక, చమక, రుద్ర మంతపఠనాలతో పంచామృతాభిషేకం జరిపిన పూజారులు బిల్వపత్రాలతో అర్చించారు. కాగా యాదగిరివాసుడి సన్నిధిలో సాయంత్రంవేళ చిరుజల్లులు కురిశాయి. వర్షపు జల్లులు కురుస్తున్నా భక్తులు ప్రధానాలయంలోని స్వయంభువులను దర్శనాలకు తరలివెళ్లారు. ఇది లా ఉండగా మండే వేసవిలో ప్రచంఢ భానుడు ఒక్కసారిగా చల్లబడగా.. వర్షం చిరుజల్లుల రూపంలో కురవడంతో భక్తులు ఎండ నుంచి కాస్త ఉపశమనం పొందారు. వివిధ విభాగాల ద్వారా రూ.17,45,758 ఆదా యం ఆలయ ఖజానాకు సమకూరినట్లు దేవస్థాన అధికారులు తెలిపారు. యాదగిరీశుడిని గురువారం పలువురు ప్రముఖులు దర్శించుకుని ప్రత్యేకపూజల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు, ఏపీ రాష్ట్రం మాచర్ల ఎమ్మెల్యే పి.రామకృష్ణారెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఫారెస్టు డైరెక్టర్‌, అడిషనల్‌ ప్రిన్సిపల్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌, ఐఎ్‌ఫఎస్‌ పీవీ రాజారామ్‌లు వేర్వేరుగా కుటుంబసమేతంగా దర్శించుకున్నారు.  


ఎలక్ట్రికల్‌ ఈఈకి మెమో జారీ?

యాదగిరి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో విధులు నిర్వర్తించే ఎలక్ట్రికల్‌ విభాగపు ఈఈ రామారావుకు మెమె జారీ చేసినట్లు తెలిసింది. ఇటీవల ఆలయంపై పత్రికల్లో వచ్చిన కథనాలు, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ఆరోపణలపై పదిహేను రోజుల్లోగా సంజాయిషీ ఇవ్వాలని దేవస్థాన ఈవో గీతారెడ్డి చార్జిమెమో ఇచ్చినట్లు సమాచారం.  

Updated Date - 2022-05-20T05:45:55+05:30 IST