సంప్రదాయ సొగసు

ABN , First Publish Date - 2020-08-12T05:52:44+05:30 IST

‘మనోహరి’గా ‘బాహుబలి’లో అందాలు చిందించిన ముద్దుగుమ్మ నోరా ఫతేహీ... ఇప్పుడు ‘ఆ పాత మధురం’ అని పాటేసుకుంటోంది. సంప్రదాయ వస్త్రాలంకరణల్లో మెరుస్తూ... బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫొటోలు పోస్ట్‌ చేస్తూ...

సంప్రదాయ సొగసు

‘మనోహరి’గా ‘బాహుబలి’లో అందాలు చిందించిన ముద్దుగుమ్మ నోరా ఫతేహీ... ఇప్పుడు ‘ఆ పాత మధురం’ అని పాటేసుకుంటోంది. సంప్రదాయ వస్త్రాలంకరణల్లో మెరుస్తూ... బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫొటోలు పోస్ట్‌ చేస్తూ... సామాజిక మాధ్యమాలను షేక్‌ చేస్తోంది. బాలీవుడ్‌ నుంచి టాలీవుడ్‌, కోలీవుడ్‌, మల్లూవుడ్‌... భాషా బేధం లేకుండా అన్నింటిలో ‘ప్రత్యేక పాట’లతో అదరగొడుతోంది ఈ కెనడా డ్యాన్సర్‌. ‘మాతృదేశం కెనడా అయినా తన హృదయం మాత్రం భారత్‌దే’ అంటూ పలు సందర్భాల్లో చెప్పిన నోరాకు మన సంస్కృతి అంటే తగని మోజు. సమయం చిక్కినప్పుడల్లా భారతీయత ఉట్టిపడే దుస్తుల్లో ఇదిగో ఇలా అలరిస్తుంటుంది. తాజాగా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసుకున్న చిత్రం ఇది. 


Updated Date - 2020-08-12T05:52:44+05:30 IST