డీమ్యాట్ అకౌంట్ ఖాళీ చేసి.. 75 లక్షలు చోరీ.. ఇంతకీ చేసిందెవరంటే?

ABN , First Publish Date - 2022-04-22T09:39:25+05:30 IST

ఇటీవలి కాలంలో మొబైల్ యాప్స్ పుణ్యమా అని చాలా మంది పెద్దగా అవగాహన లేకున్నా డీమ్యాట్ అకౌంట్లు తీసుకొని ట్రేడింగ్ చేస్తున్నారు. కొద్దోగొప్పో అవగాహన ఉన్న వాళ్లు బాగానే సంపాదిస్తున్నారు. అయితే ఇలాంటి అకౌంట్లు తీసుకునే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని నిరూపించే ఘటన తాజాగా యూపీలోని ఘజియాబాద్‌లో వెలుగు చూసింది...

డీమ్యాట్ అకౌంట్ ఖాళీ చేసి.. 75 లక్షలు చోరీ.. ఇంతకీ చేసిందెవరంటే?

ఇటీవలి కాలంలో మొబైల్ యాప్స్ పుణ్యమా అని చాలా మంది పెద్దగా అవగాహన లేకున్నా డీమ్యాట్ అకౌంట్లు తీసుకొని ట్రేడింగ్ చేస్తున్నారు. కొద్దోగొప్పో అవగాహన ఉన్న వాళ్లు బాగానే సంపాదిస్తున్నారు. అయితే ఇలాంటి అకౌంట్లు తీసుకునే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని నిరూపించే ఘటన తాజాగా యూపీలోని ఘజియాబాద్‌లో వెలుగు చూసింది.

ఇక్కడ ఒక ట్రేడింగ్ కంపెనీలో ఒక వ్యక్తి డీమ్యాట్ అకౌంట్ తీసుకున్నారు. సడెన్‌గా అతని ఖాతా ఖాళీ అయిపోయి, అందులోని రూ.75 లక్షలు పోవడంతో అతను గగ్గోలుపెట్టాడు. దీంతో కంపెనీ ఇంటర్నల్ దర్యాప్తు చేసింది. దానిలో కంపెనీ మేనేజర్ సహా అకౌంట్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన ఇద్దరు ఉద్యోగులే తమ హస్తలాఘవం చూపించారని తేలింది. 


పూర్తి వివరా్లోకి వెళ్తే.. నోయిడాకు చెందిన మాస్టర్ ట్రస్ట్ కంపెనీకి చెందిన వినియోగదారుడి అకౌంట్ పూర్తిగా ఖాళీ అయిపోయింది. దీంతో అతను కంపెనీకి ఫిర్యాదు చేశాడు. దీనిపై కంపెనీ అంతర్గత దర్యాప్తు జరిపింది. దీనిలో కంపెనీ మేనేజర్ అజిత్ సింహ్ ఈ కుట్ర వెనుక ఉన్న మాస్టర్ మైండ్ అని తేలింది. 


అకౌంట్ డిపార్ట్‌మెంట్లో‌ పనిచేసే అనూప్ కుమార్, విజయ్ త్రిపాఠీతో కలిసి ఈ ప్లాన్ వేసినట్లు సమాచారం. ఈమెయిల్ ఐడీ, ఫోన్ నెంబర్ మార్చి ఈ ఖాతా ఖాళీ చేసినట్లు అధికారులు గుర్తించారు. దీంతో కంపెనీ వీరిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అజిత్ సింహ్ ఖాతాలో ఉన్న 15 లక్షల రూపాయలతోపాటు డీమ్యాట్ ఖాతాలో ఉన్న మరో రూ.25 లక్షల నగదును జప్తు చేశారు. ప్రస్తుతం వీళ్లు ముగ్గురూ జైల్లో ఉన్నట్లు అధికారులు తెలిపారు.


Updated Date - 2022-04-22T09:39:25+05:30 IST