ఆ చెట్లకు డబ్బులు కాదు.. ఏకంగా బంగారమే కాస్తోంది.. వ్యాపారులకు కాసులు కురిపిస్తున్న చెట్లు..!

ABN , First Publish Date - 2021-11-04T03:19:25+05:30 IST

పెద్ద పెద్ద కోరికలు కోరే సమయాల్లో.. డబ్బులేమైనా చెట్లకు కాస్తున్నాయా.. అని అంటూ ఉంటాం. చెట్లకు డబ్బులు కాయవని తెలుసు. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే చెట్లకు డబ్బులు కాదు, ఏకంగా బంగారమే కాస్తోంది.

ఆ చెట్లకు డబ్బులు కాదు.. ఏకంగా బంగారమే కాస్తోంది.. వ్యాపారులకు కాసులు కురిపిస్తున్న చెట్లు..!

విపరీతంగా ఖర్చు చేసే సమయంలో లేదా పెద్ద పెద్ద కోరికలు కోరే సమయాల్లో.. డబ్బులేమైనా చెట్లకు కాస్తున్నాయా.. అని అంటూ ఉంటాం. చెట్లకు డబ్బులు కాయవని తెలుసు. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే చెట్లకు డబ్బులు కాదు, ఏకంగా బంగారమే కాస్తోంది. వీటి ద్వారా వ్యాపారలు లక్షలు సంపాదిస్తున్నారు. ఏంటి నమ్మశక్యంగా లేదా. విషయం పూర్తిగా తెలుసుకుంటే.. మీరే అవాక్కవుతారు. అవి ఏం చెట్లు, ఎక్కడున్నాయి.. తదితర వివరాల్లోకి వెళితే..


స్పెయిన్‌లోని టియర్రా డి పినారెస్, సియర్రా డి గ్రెడోస్ పర్వతాల మధ్య.. 4,00,000 హెక్టార్ల విస్తీర్ణంలోని పైన్ వృక్షాలతో నిండిన దట్టమైన అటవీ ప్రాంతం ఉంటుంది. ఇక్కడి వారికి పైన్ చెట్ల నుంచి వచ్చే జిగురు ఆదాయ వనరుగా మారింది. తరతరాలుగా వారు ఇదే వృత్తిని కొనసాగిస్తున్నారు. ఇక్కడి కాస్టిల్లా వైలీయోన్ ప్రాంతం.. ఎత్తైన పీఠభూములు, మధ్యయుగం నాటి పట్టణాలతో ఇమిడి ఉంటుంది. పైన్ చెట్ల నుంచి వచ్చే జిగురును అప్పట్లో.. నౌకలకు వాటర్ ప్రూఫ్‌గా, గాయాలకు మందుగా వాడడంతో పాటూ కాగడాలు వెలిగించడం వంటి వాటి కోసం ఉపయోగించేవారు. 19, 20వ శతాబ్దాల వరకూ దీని ద్వారా పెద్దగా ఆదాయం వచ్చేది కాదు. 19వ శతాబ్దం మధ్యలో ఈ జిగురుతో ప్లాస్టిక్, టైర్లు, రబ్బరు తదితరాలను తయారు చేసేవారు. తర్వాత కొందరు వ్యాపారులు.. ఈ జిగురు విలువను గుర్తించి, కూలీలను ఏర్పాటు చేసి సేకరించడం మొదలుపెట్టారు.


యూరప్‌లో పదేళ్లుగా ఈ వ్యాపారం పుంజుకుంది. అయితే చెట్లను విపరీతంగా నరికేస్తుండడంతో తరిగిపోతున్నాయి.. దీంతో ప్రస్తుతం చెట్లకు గాట్లు పెట్టి జిగురును తీస్తున్నారు. కల్లు తరహాలో కుండలను ఏర్పాటు చేసి.. జిగురును సేకరిస్తారు. అనంతరం దాన్ని ఫ్యాక్టరీలకు పంపి డిస్టిలేషన్ ప్రక్రియ కొనసాగిస్తారు. అందులో ఉండే టర్పెంటైన్‌ను వెలికి తీసిన తర్వాత.. అది పసుపు రంగులోకి మారి గట్టిగా అవుతుంది. ఫైనల్‌గా ఆ జిగురు మెరిసే పసుపు వర్ణంతో ఉండే రాయిలా తయారవుతుంది. అలా బంగారంగా మారిన రాళ్లను విక్రయించి సొమ్ము చేసుకుంటూ ఉంటారు.

Updated Date - 2021-11-04T03:19:25+05:30 IST