Abn logo
Sep 24 2021 @ 21:47PM

ఇండియా-అమెరికా మధ్య అదే ముఖ్యం: మోదీ

వాషింగ్టన్: ఇండియా-అమెరికా దేశాల మధ్య వాణిజ్య అంశాలు చాలా కీలకమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న మోదీ.. ఆ దేశ అధ్యక్షుడు జోయ్ బిడెన్‌ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక అంశాలపై ఇరు దేశాల అధినేతలు చర్చించారు. ఇండియా-అమెరికా మధ్య ఉన్న సత్సంబంధాల గురించి ఈ సమావేశానికి ముందు బైడెన్ సంతృప్తి వ్యక్తం చేయగా ఇరు దేశాల మద్య వాణిజ్య అంశాలపై మోదీ ప్రధానంగా చర్చించారు.


‘‘ఈ దశాబ్దంలో ఇరు దేశాలు పరస్పరం ఎంతో సహకరించుకున్నాయి. ఇరు దేశాల మధ్య వాణిజ్య అంశాలు మరింత బలపడడం చాలా అవసరం. అమెరికా-ఇండియా మధ్య ఉపయోగకరమైన అంశాలు, వాటికి కావాల్సిన వాతావరణం చాలా ఎక్కువగా ఉన్నాయి. అయితే దశాబ్ద కాలంగా వాణిజ్యంలో మంచి పురోగతి సాధించాం’’ అని మోదీ అన్నారు. ఈ సమావేశానికి ముందు మోదీ స్పందిస్తూ ‘‘సాదర స్వాగతం పలికిన అమెరికా అధ్యక్షుడికి కృతజ్ణతలు. 2014-2016 మధ్య కాలంలో మా మద్య పరస్పర సహకారం గురించి గుర్తు చేసుకున్నాను. ఆ సమయంలో ఇండియా-అమెరికా దేశాల మధ్య సంబంధాల కోసం బైడెన్ చాలా సహకరించారు. దానిని కొనసాగించడానికి కృషి చేస్తున్నందుకు సంతోషిస్తున్నాను’’ అని మోదీ చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండిImage Caption