రైతులకు మద్దతుగా ట్రాక్టర్‌, మోటర్‌ సైకిళ్ల ర్యాలీ

ABN , First Publish Date - 2021-01-27T06:14:46+05:30 IST

వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరురూ వివిధ సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం మా ర్కాపురం పట్టణంలో ట్రాక్టర్‌, మోటార్‌ సైకిళ్ల ర్యాలీ నిర్వహించారు.

రైతులకు మద్దతుగా ట్రాక్టర్‌, మోటర్‌ సైకిళ్ల ర్యాలీ
మార్కాపురంలో బైకు ర్యాలీ నిర్వహిస్తున్న పలు సంఘాల ప్రతినిధులు

 



మార్కాపురం (వన్‌టౌన్‌) జనవరి 26: వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరురూ వివిధ సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం మా ర్కాపురం పట్టణంలో ట్రాక్టర్‌, మోటార్‌ సైకిళ్ల ర్యాలీ నిర్వహించారు. పట్టణ శివారులోని మార్కెట్‌ యార్డు నుంచి పాత బస్టాండ్‌, నాయుడు వీధి, రాజాజీ వీధి, కంభం సెంటర్‌, కోర్టు సెంటర్‌ నుంచి పూల సుబ్బయ్య కాలనీ వరకూ ఈ ప్రదర్శన సాగింది. మార్కాపురం, పెద్దారవీడు, తర్లుపాడు మండలాల రైతులు ట్రాక్టర్లు, మోటారు సైకిళ్లతో పాల్గొన్నారు. కేంద్రం ఇటీవల అమల్లోకి తెచ్చిన మూడు సాగు చట్టాలు రద్దు చేయాలని, రైతు గెలవాలి.. వ్యవసాయం నిల వాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సం ఘం జిల్లా ఉపాధ్యక్షుడు డి.సోమయ్య, జి.రాజశేఖర్‌, ఎంపీజే నాయ కుడు రజాక్‌, ఈటీఎఫ్‌ జిల్లా కార్యదర్శి బొద్దుల వీరారెడ్డి, జమాతే ఇస్లాం నాయకులు సికిందర్‌, సీఐటీయూ పశ్చిమ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు డీకేఎం రఫి, డీవైఎఫ్‌ఐ పశ్చిమ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు ఏనుగుల సురేష్‌, కేవీపీఎస్‌ జిల్లా కన్వీనర్‌ జె.రాజు, ఎస్‌ఎఫ్‌ఐ పశ్చిమ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు ఈశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. 

కనిగిరిలో..

కనిగిరి :  కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేసే వరకూ తమ పోరాటం జరుగుతుందని ఏపీ రైతు సంఘం పశ్చిమ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు పిల్లి తిప్పారెడ్డి హెచ్చరించారు. నూతన వ్యవసాయ చట్టాలను  రద్దు చేయాలని ఢిల్లీలో రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా  మంగళవారం కనిగిరిలో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఆటోలు, ట్రాక్టర్లు, మోటారు బైక్‌లతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక పామూరు బస్టాండ్‌ సెంటర్‌లో మానవహారం చేపట్టారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు కె మాల్యాద్రి, బడుగు వెంకటేశ్వర్లు,  ప్రసన్న, శ్రీను, మహేంద్ర, రైతు సంఘం నాయకులు నాగిరెడ్డి, శ్రీరాములు, వెంకటేశ్వర్లు, ఎం కొండారెడ్డి, కోటేశ్వరరావు, పిచ్చయ్య, గురవయ్య, రమణమ్మ, బ్రహ్మయ్య  పాల్గొన్నారు. 


Updated Date - 2021-01-27T06:14:46+05:30 IST