కిసాన్‌ మజ్దూర్‌ర్యాలీకి మద్దతుగా ట్రాక్టర్‌ ర్యాలీ

ABN , First Publish Date - 2021-01-27T06:33:50+05:30 IST

రైతులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన మూడు రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఢిల్లీలో చేపట్టిన కిసాన్‌ మజ్దూర్‌ ర్యాలీకి మద్ధతుగా మంగళ వారం జిల్లా కేంద్రంలో వామపక్షాల ఆధ్వర్యంలో ట్రాక్టర్‌ ర్యాలీని చేపట్టారు.

కిసాన్‌ మజ్దూర్‌ర్యాలీకి మద్దతుగా ట్రాక్టర్‌ ర్యాలీ
ఏఐకేఎస్‌సీసీ ట్రాక్టర్‌తో రైతుకవాతు

నిర్మల్‌ టౌన్‌, జనవరి 26 : రైతులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన మూడు రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఢిల్లీలో చేపట్టిన కిసాన్‌ మజ్దూర్‌ ర్యాలీకి మద్ధతుగా మంగళ వారం జిల్లా కేంద్రంలో వామపక్షాల ఆధ్వర్యంలో ట్రాక్టర్‌ ర్యాలీని చేపట్టారు. జిల్లా కేంద్రంలోని గాంధీ పార్క్‌ నుండి శివాజీ చౌక్‌, ప్రొఫెసర్‌ జయశంకర్‌ చౌరస్తా, బస్టాండ్‌ మీదుగా మినీ ట్యాంక్‌బండ్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సంద ర్భంగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు నంది రామయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక మూడు చట్టాలలు కార్పొరేట్‌ వ్యవ స్థను లాభం చేసే విధంగా ఉన్నాయన్నారు. వారికి మరింత స్వేచ్ఛ కల్పించినట్లు అవుతుందన్నారు. కేంద్రం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలని లేని యెడల ఆందోళనలు ఉదృతం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్‌టీయూ కార్యదర్శి రాజన్న, హెచ్‌. విలాస్‌, జిఎస్‌. నారాయణ, హెచ్‌ఎన్‌ నారాయణ, సురేష్‌, లక్ష్మణ్‌, లక్ష్మీ, వామపక్ష సంఘాల నాయకులు పాల్గొన్నారు. 

ఖానాపూర్‌, జనవరి 26 : కేంద్రం తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలని ఏఐకేఎస్‌సిసి జిల్లా నాయకులు నందిరామయ్య డిమాండ్‌ చేశారు. ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా దేశవ్యాప్త పిలుపులో బాగంగా మంగళవారం ఖానాపూర్‌లో ఏఐకేఎస్‌సీసీ ఆద్వర్యంలో రైతు కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక విశ్రాంతి భవనం నుండి తెలంగాణ చౌక్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎస్‌సీసీ జిల్లా నాయకులు విలాస్‌, భీమయ్య, ఉపాలి, రణధీర్‌, నాగెల్లి నర్సయ్య, రాజేశ్వర్‌ తదితరులున్నారు.  

Updated Date - 2021-01-27T06:33:50+05:30 IST