పెందుర్తిలో ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహిస్తున్న దృశ్యం
పెందుర్తి, జనవరి 26: ఢిల్లీ రైతులకు మద్దతుగా మంగళవారం పెందుర్తిలో కిసాన్ ట్రాక్టర్ మార్చ్ ర్యాలీ నిర్వహించారు. సీపీఎం, డీవైఎఫ్, సిటూ, ఐద్వా, రైతు సంఘాల ఆఽధ్వర్యంలో చేపట్టిన ఈ ర్యాలీ పెందుర్తి నుంచి చినముషివాడ వరకు సాగింది. ట్రాక్టర్లు, ఎడ్లబండ్లతో ఈ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ చట్టాలను వివరిస్తూ ప్రజానాట్య మండలి సభ్యులు గీతాలు ఆలపించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నగర ప్రధాన కార్యదర్శి బి.గంగారావు, పి.వెంకటరెడ్డి, బి.రమణి, బి.అనంతలక్ష్మి, జి.అప్పలరాజు, షేక్ షఫీ తదితరులు పాల్గొన్నారు.