Abn logo
Jul 30 2021 @ 22:22PM

ఎస్సారెస్పీ కెనాల్‌లో ట్రాక్టర్ డ్రైవర్ గల్లంతు

పెద్దపల్లి: జిల్లాలోని సుల్తానాబాద్ మండలం రేగడిమద్దికుంట గ్రామ సమీపంలో అదుపుతప్పి D 86 ఎస్సారెస్పీ కెనాల్‌లో ట్రాక్టర్ పడిపోయింది. ట్రాక్టర్ డ్రైవర్ ఎర్రంశెట్టి శ్రీనివాస్ కెనాల్‌లో గల్లంతయ్యాడు. శ్రీనివాస్ కోసం సంఘటన స్థలంలో స్థానికులు గాలిస్తున్నారు. రాత్రి సమయం కావడంతో గాలింపు చర్యలకు అంతరాయం కలుగుతోంది.