సొంత అవసరాలకు పంచాయతీ ట్రాక్టర్‌!

ABN , First Publish Date - 2020-12-03T04:48:54+05:30 IST

సొంత అవసరాలకు పంచాయతీ ట్రాక్టర్‌!

సొంత అవసరాలకు పంచాయతీ ట్రాక్టర్‌!
పంచాయతీ ట్రాక్టర్‌లో కట్టెలు తోలుకుంటున్న సర్పంచ్‌ సోదరుడు

కులకచర్ల: గ్రామ పంచాయతీ అవసరాలకు వాడాల్సిన ట్రాక్టర్‌ను సర్పంచ్‌ బంధువులు తమ సొంత అవసరాలకు వాడుకుంటున్నారు. గోరిగడ్డ తండా గ్రామ పంచాయతీకి ప్రభుత్వం ట్రాక్టర్‌ మంజూరు చేసింది. సర్పంచ్‌ నీలిబాయి తన భర్త బాబ్యతో కలిస పూణేలో ఉంటుంది. ఇక్కడి గ్రామ పంచాయతీ వ్యవహారం ఆమె సోదరుడు చూస్తున్నాడు. ట్రాక్టర్‌ను పంచాయతీ పనులకు వాడకుండా సొంత పనులకు వాడుకుంటున్నాడని గ్రామస్థులు ఆరోపించారు. తన పొలం నుంచి కట్టెలు, కిరాయి పనులు చేసేందుకు వాడుకుంటున్నాడని ఆరోపించారు. సర్పంచ్‌ సంతకాలు కూడా అతనే పెడతాడని, మహిళలకు రిజర్వేషన్‌ కల్పించి పదవులు కల్పిస్తే వారి బంధువులే పెత్తనం చలాయిస్తున్నారని చర్యలు తీసుకోవాలని కోరారు.

Updated Date - 2020-12-03T04:48:54+05:30 IST