బాంజీపేట గుట్టపై ఖనిజాల జాడలు

ABN , First Publish Date - 2021-09-07T17:40:02+05:30 IST

మండలంలోని భాంజీపేట గ్రామంలో..

బాంజీపేట గుట్టపై ఖనిజాల జాడలు

బాంజీపేట బొడబండ గుట్టపై నాగు పాములా సాగుతున్నట్లు కనిపిస్తున్న వీన్స్‌


రఘునాథపల్లి: మండలంలోని భాంజీపేట గ్రామంలోగల బొడబండ గుట్టపై అనేక చోట్ల ఖనిజాల జాడలు తెలిపే వీన్స్‌ కనిపించాయని చరిత్ర పరిశోధకుడు రెడ్డి రత్నాకర్‌ రెడ్డి సోమవారం తెలిపారు. గుట్టపై నాగు పాము వలే సాగుతున్నట్లు కనిపించే సుమారు 50 మీటర్ల వీన్స్‌ ఒకటి కనిపించిందని, శిలలు ఏర్పడే చివరి దశలోనే ఎక్కువగా వీన్స్‌ ఏర్పడతాయని, సహజంగా రాళ్లలో ఏర్పడే పొడవైన రేఖలు వాటి రంగు, వంకలు వంకలుగా తిరిగే సొగసైన రూపం ఎక్కవగా ఆకర్షిసుందని అన్నారు. వీన్స్‌ ఉన్న చోట వాటి వివరాలను తెలిపే బోర్డు ఏర్పాటు చేస్తే ప్రజలు భూమి చరిత్రను తెలుసుకునేందుకు ఉత్సాహం చూపు తారని, ఆ దిశగా పురావస్తు శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. 


Updated Date - 2021-09-07T17:40:02+05:30 IST