Kintree: కుటుంబాలను కలిపే వేదిక కిన్‌ట్రీ.. ఇప్పుడు మీ మూలాలు కనుగొనడం మరింత సులభం

ABN , First Publish Date - 2022-08-03T00:09:59+05:30 IST

ప్రపంచ శరవేగంగా మారిపోతోంది. తెలియని వారితో బంధాలు పెనవేసుకుపోతున్నాయి. ఇప్పుడీ బంధాలు మరింత

Kintree: కుటుంబాలను కలిపే వేదిక కిన్‌ట్రీ.. ఇప్పుడు మీ మూలాలు కనుగొనడం మరింత సులభం

ముంబై: ప్రపంచ శరవేగంగా మారిపోతోంది. తెలియని వారితో బంధాలు పెనవేసుకుపోతున్నాయి. ఇప్పుడీ బంధాలు మరింత విస్తృతం కానున్నాయి. కుటుంబ సభ్యులను మాత్రమే కాదు.. బహుదూరపు బంధువులను కూడా కలపడమే లక్ష్యంగా కిన్‌ట్రీ (Kintree) తన సేవలను ప్రారంభించింది. ఈ  ఆల్‌ ఇన్‌ వన్‌ సోషల్‌ మీడియా వేదిక కుటుంబాలకు అత్యంత విలువైన, వినియోగదారులకు అనుకూలమైన వేదికగా నిలువనుందనడం అతిశయోక్తి కాదు.  తమ కుటుంబాలలో  ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటూనే,  ఆ విషయాలు గోప్యంగా ఉండాలనుకునే వ్యక్తుల కోసం అవసరమైన సేవలను ఈ వేదిక అందిస్తోంది.


కిన్‌ట్రీ ప్రాథమిక ఫీచర్‌తో కుటుంబ చరిత్రను ఒడిసిపట్టుకునేందుకు తగిన అవకాశం కల్పిస్తూనే ఫ్యామిలీ ట్రీ  సృష్టించుకునే అవకాశమూ అందిస్తోంది. ఈ ప్లాట్‌ఫామ్‌సులభమైన వినియోగ విధానం కారణంగా విభిన్న తరాల వ్యక్తులు కూడా సౌకర్యవంతంగా వినియోగించుకోవచ్చు. అంతేకాదు, కుటుంబ సభ్యుల మధ్య ఫొటోలను సురక్షితంగా పంచుకునేందుకు కిన్‌ట్రీ వీలు కల్పిస్తోంది.


కిన్‌ట్రీ ఆవిష్కరణపై ఆ సంస్థ సహ వ్యవస్థాపకుడు  ఇఫ్తికార్‌ ఖాన్‌ మాట్లాడుతూ.. కుటుంబం ఎప్పుడూ ముఖ్యమైనదేనని తమ అభిప్రాయమని అన్నారు. తమ బంధవులు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కిన్‌ట్రీ ద్వారా కలుసుకోవచ్చన్నారు. దూరమైన తమ బంధువులను ఎప్పుడైనా, ఎక్కడైనా,  ఏ సమయంలో అయినా  సురక్షిత  మాధ్యమం ద్వారా  కనుగొనే అవకాశం కిన్‌ట్రీ ద్వారా లభిస్తుందన్నారు. కిన్‌ట్రీ మరో కో ఫౌండర్ శ్యామ్ జవేరి మాట్లాడుతూ.. ఈ ప్రపంచం చాలా చిన్నదని, దీనిని వినియోగించడం మొదలైన తర్వాత ఆ వాస్తవం అర్థమవుతుందని అన్నారు. తాతముత్తాలకు ఆవల మరెన్నో తరాలకు సంబంధించిన వివరాలను కూడా తెలుసుకునేందుకు కిన్‌ట్రీ సాయపడుతుందని అన్నారు. కిన్‌ట్రీ ప్రస్తుతం 12 భాషల్లో అందుబాటులో ఉంది.

Updated Date - 2022-08-03T00:09:59+05:30 IST