స్కూలు బ్యాగు కోసం చెరువులో దిగి గల్లంతు

ABN , First Publish Date - 2020-11-01T09:37:24+05:30 IST

కమారుడి స్కూలు బ్యాగు కోసం చెరువులో దిగి ఓ తండ్రి గల్లంతయ్యాడు. అగ్నిమాపక శాఖ ఏడీఎఫ్‌ అనీల్‌కుమార్‌, కాణిపాకం ఎస్‌ఐ మనోహర్‌ కథనం మేరకు..

స్కూలు బ్యాగు కోసం చెరువులో దిగి గల్లంతు

ఐరాల, అక్టోబరు 31: కమారుడి స్కూలు బ్యాగు కోసం చెరువులో దిగి ఓ తండ్రి గల్లంతయ్యాడు. అగ్నిమాపక శాఖ ఏడీఎఫ్‌ అనీల్‌కుమార్‌, కాణిపాకం ఎస్‌ఐ మనోహర్‌ కథనం మేరకు.. ఐరాల మండలం మోటకాంపల్లెకు చెందిన జంషీద్‌ను దామలచెరువుకు చెందిన రహంతుల్లా (40)వివాహం చేసుకున్నాడు. శుక్రవారం మిలాద్‌ ఉన్‌ నబీ సందర్భంగా కుటుంబ సమేతంగా అత్తగారి ఊరైన మోటకాంపల్లెకు విచ్చేశాడు. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం జంషీద్‌ దుస్తులు ఉతకడానికి స్థానికంగా ఉన్న చెన్నరాయుని చెరువుకు వెళ్లింది. దుస్తులు ఉతికే క్రమంలో కుమారుడి స్కూల్‌ బ్యాక్‌ చెరువులోకి కొట్టుకుపోయింది.


ఈ విషయాన్ని భర్తకు ఫోన్‌లో తెలిపింది. దీంతో రహంతుల్లా తన స్నేహితుడు అజీమ్‌తో కలిసి చెరువు వద్దకు వెళ్లాడు. రహంతుల్లా బ్యాగుకోసం చెరువులోకి దిగాడు. చెరువు ముళ్లచెట్లతో నిండి ఉండడంతో ఆ చెట్ల మధ్య ఓ చోట బురదలో ఇరుక్కుపోయాడు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు సాయంత్రం ఏడు గంటలక వరకు గాలించినా ప్రయోజనం లేకపోయింది. ఆదివారం గాలింపు కొనసాగించనున్నారు. దీంతో దామలచెరువులో, మోటకాంపల్లెలో విషాద ఛాయలు అలముకున్నాయి. గల్లంతైన వ్యక్తికి ఇంజినీరింగ్‌ పూర్తిచేసిన కుమార్తె, 9వ తరగతి చదువుతున్న కుమారుడు ఉన్నారు.  

Updated Date - 2020-11-01T09:37:24+05:30 IST