వాల్మీకి మహర్షికి ఘన నివాళి

ABN , First Publish Date - 2020-11-01T09:44:14+05:30 IST

వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు శనివారం పడమటి మండలాల్లో ఘనంగా జరిగాయి.

వాల్మీకి మహర్షికి ఘన నివాళి

మదనపల్లె రూరల్‌, అక్టోబరు 31 : వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు శనివారం పడమటి మండలాల్లో ఘనంగా జరిగాయి. మదనపల్లె, నిమ్మనపల్లె, బి.కొత్తకోట, రామసముద్రం, కురబలకోట మండలాల్లో  వాల్మీకి మహర్షి చిత్రపటాలను ఏర్పాటుచేసి ఘన నివాళులు అర్పించారు. మదనపల్లె రాగిమాను సర్కిల్‌లో వాల్మీకి రిజర్వేషన్‌ పోరాటసమితి నాయకులు, వాల్మీకివీధిలోని కులపెద్దల ఆధ్వర్యంలో జరిగిన జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే నవాజ్‌బాషా పాల్గొని వాల్మీకి విగ్రహానికి పూజలు చేశారు. వైసీపీ నాయకులు జింకా వెంకటాచలపతి, వీఆర్పీఎస్‌ జిల్లా అధ్యక్షుడు పొదల నరసింహులు, రాయలసీమ కన్వీనర్‌ ముత్తరాశి హరికృష్ణ, రాష్ట్ర అధికార ప్రతినిధి బొగ్గిటి కృష్ణమూర్తి పాల్గొన్నారు. అలాగే బసినికొండ, వలసపల్లె గ్రామాల్లోని వాల్మీకులు వాల్మీకి విగ్రహానికి పూజలు చేసి భారీఎత్తున బైక్‌ర్యాలీ నిర్వహించారు. కొత్తపల్లె పంచాయతీ రంగారెడ్డికాలనీలో జరిగిన వాల్మీకి జయంతి వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ దేశాయ్‌తిప్పారెడ్డి పాల్గొని వాల్మీకి విగ్రహానికి పూజలు చేశారు.నిమ్మనపల్లెలో రెడ్డిభాస్కర ఆధ్వర్యంలో వాల్మీకి చిత్రపటానికి నివాళులర్పించారు. కురబలకోట మండలం అంగళ్లు బస్టాండ్‌ కూడలిలో వాల్మీకి చిత్రపటానికి నివాళులర్పించారు.రామసముద్రం చెక్‌పోస్టు వద్ద వాల్మీకి విగ్రహానికి ఎమ్మెల్యే నవాజ్‌బాషా పూజలు చేసి మొక్కుకున్నారు. బి.కొత్తకోట మండలం బడికాయలపల్లెలో  టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పర్వీన్‌తాజ్‌ వాల్మీకి విగ్రహానికి పూలమాల వేసి పూజలు చేశారు. 

Updated Date - 2020-11-01T09:44:14+05:30 IST