Abn logo
Oct 30 2020 @ 06:15AM

ప్రగతి సాధించకుంటే చర్యలు

 సచివాలయ కార్యదర్శులకు కలెక్టర్‌ హెచ్చరిక


తిరుపతి, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): ‘సచివాలయ కార్యదర్శులు ప్రగతిపై దృష్టిపెట్టాలి. మీసేవా కార్యాలయాలతో పోటీపడి ప్రజలకు పౌర సేవలు అందించాలి. లేదంటే చర్యలు తప్పవు’ అని కలెక్టర్‌ భరత్‌గుప్తా హెచ్చరించారు. తిరుపతి కార్పొరేషన్‌ కార్యాలయంలో గురువారం వార్డు సెక్రటరీలు, వలంటీర్ల సమీక్షలో ఆయన దిశానిర్దేశం చేశారు. పౌరసేవల దరఖాస్తులు మీసేవా కేంద్రాలనుంచి అత్యధికంగా వస్తున్నాయని, సచివాలయాల నుంచి కేవలం 10 శాతమే ఉందన్నారు. ఇద్దరు, ముగ్గురు సిబ్బందితో మీసేవా నిర్వాహకులు అందించే సేవలకన్నా.. సచివాలయాల్లో ఇంతమంది ఉండీ ఉపయోగం లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. జీడీ నెల్లూరు మండలంలో 27వేల దరఖాస్తులు స్వీకరించి ప్రగతి సాధించారన్నారు. జగనన్న తోడు పథకం కోసం జిల్లాలో 49వేల దరఖాస్తులు వస్తే తిరుపతిలో మూడువేలే వచ్చాయన్నారు. ఈసమీక్షలో ఆర్డీవో కనకనరసా రెడ్డి, ఏడీసీ హరిత, ఎంఈ చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు. కాగా, ఆర్డీవో కార్యాలయం నుంచి జేసీ వీరబ్రహ్మంతో కలిసి ఎంపీడీవోలు, డిజిటల్‌ అసిస్టెంట్లతో కలెక్టర్‌ భరత్‌గుప్తా వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పౌరసేవల్లో ప్రగతి సాధించిన నారాయణవనం, ఎస్‌ఆర్‌పురం, శ్రీకాళహస్తి, పీలేరు ఎంపీడీవోలను అభినందించారు. వెనుకబడిన సచివాలయాల్లో దరఖాస్తుల సంఖ్య పెంచాలన్నారు. జగనన్నతోడు పథకంలో లబ్ధిదారులను వచేఏ్చనెల మూడో తేదీలోగా గుర్తించాలన్నారు. 

Advertisement
Advertisement