వరల్డ్‌ ర్యాంకింగ్స్‌లో ఎస్వీయూకు సమున్నత గుర్తింపు

ABN , First Publish Date - 2020-10-30T11:45:19+05:30 IST

టైమ్స్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ వరల్డ్‌ ర్యాంకింగ్స్‌-2021లో ఎస్వీయూనివర్సిటీకి సమున్నత గుర్తింపు లభించింది.

వరల్డ్‌ ర్యాంకింగ్స్‌లో ఎస్వీయూకు సమున్నత గుర్తింపు

తిరుపతి (విశ్వవిద్యాలయాలు), అక్టోబరు 29: టైమ్స్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ వరల్డ్‌ ర్యాంకింగ్స్‌-2021లో ఎస్వీయూనివర్సిటీకి సమున్నత గుర్తింపు లభించింది. ఇటీవల ఈ సంస్థ ఎస్వీయూకు 801-1000 మధ్య ర్యాంకును ప్రకటించింది. సబ్జెక్టుల వారీగా మరోసారి ర్యాంకులు ప్రకటించగా, ఇంజినీరింగ్‌లో 501-600 మధ్య.. ఫిజికల్‌ సైన్స్‌లో 601-800 మధ్య ర్యాంకులను ఎస్వీయూ సొంతం చేసుకుంది. ఆయా సబ్జెక్టుల్లో చేపట్టిన బోధన, పరిశోధన, విస్తరణ, ఉపాధి, ప్రమాణాలు, సదుపాయాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. విద్యార్థులు, ఉద్యోగుల సమష్టి కృషి ఫలితంగా ఈ గుర్తింపు లభించిందని రెక్టార్‌ సుందరవల్లి, రిజిస్ట్రార్‌ శ్రీధర్‌ రెడ్డి, రీసెర్చ్‌ డీన్‌ విజయభాస్కర్‌రావు పేర్కొన్నారు. భవిష్యత్తులో మరింత ఉన్నత గుర్తింపును పొందాలని ఆకాంక్షించారు.

Updated Date - 2020-10-30T11:45:19+05:30 IST