టెస్ట్‌ డ్రైవ్‌ పేరుతో మరో బైక్‌ చోరీ

ABN , First Publish Date - 2020-10-28T11:09:46+05:30 IST

నగరంలో మంగళవారం మరో బైక్‌ చోరీకి గురైంది. టెస్ట్‌ డ్రైవ్‌ పేరుతో రెండు వాహనాలను చోరీ చేసిన అదే దొంగ మంగళవారం కూడా మరో బైక్‌ను అపహరించుకెళ్లాడు.

టెస్ట్‌ డ్రైవ్‌ పేరుతో మరో బైక్‌ చోరీ

చిత్తూరు, అక్టోబరు 27: నగరంలో మంగళవారం మరో బైక్‌ చోరీకి గురైంది. టెస్ట్‌ డ్రైవ్‌ పేరుతో రెండు వాహనాలను చోరీ చేసిన అదే దొంగ మంగళవారం కూడా మరో బైక్‌ను అపహరించుకెళ్లాడు. ఒకటో పట్టణ ఎస్‌ఐ మోహన్‌కుమార్‌  తెలిపిన వివరాలు... తమిళనాడు రాష్ట్రం వేలూరు టౌన్‌ ఓటేరుకు చెందిన దినేష్‌ తన పల్సర్‌-200సీసీ వాహనాన్ని ఓఎల్‌ఎక్స్‌లో అమ్మకానికి పెట్టాడు. యాదమరి మండలం అత్తికారపల్లెకు చెందిన పవన్‌ స్థానిక పీవీకేఎన్‌ డిగ్రీ కళాశాల వద్దకు రమ్మన్నాడు. బేరం కుదిరాక... టెస్ట్‌ డ్రైవ్‌ చేస్తానని చెప్పి వాహనాన్ని తీసుకొని ఉడాయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఇదే దొంగ మురకంబట్టు, ఎస్టేట్‌ వద్ద రెండు ద్విచక్ర వాహనాలతో ఉడాయించాడు. 

Updated Date - 2020-10-28T11:09:46+05:30 IST