ఉల్లికోసం బారులు

ABN , First Publish Date - 2020-10-28T10:58:54+05:30 IST

చిత్తూరు రైతుబజారులో మంగళవారం రాయితీ ఉల్లి కోసం జనం ఎగబడ్డారు. తెల్లవారు జామునుంచే వందలసంఖ్యలో జనం రావడంతో పోలీసులు జోక్యం చేసుకోవాల్సివచ్చింది.

ఉల్లికోసం బారులు

చిత్తూరు (వ్యవసాయం), అక్టోబరు 27: చిత్తూరు రైతుబజారులో మంగళవారం రాయితీ ఉల్లి కోసం జనం ఎగబడ్డారు. తెల్లవారు జామునుంచే వందలసంఖ్యలో జనం రావడంతో పోలీసులు జోక్యం చేసుకోవాల్సివచ్చింది. మార్కెట్‌లో కిలో ఉల్లి రూ. 90 నుంచి 100 వరకు ధర పలుకుతుండడంతో ప్రభుత్వం మహారాష్ట్ర నుంచి ఉల్లి లోడ్లను తెప్పించి రాయితీపై పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంది. కిలో ఉల్లి రూ. 40కే ఇస్తుండడంతో చిత్తూరు నగరవాసులే కాకుండా పరిసర మండలాల నుంచి కూడా జనం క్యూగట్టారు.మధ్యాహ్నం వరకు 12 టన్నులు  పంపిణీ చేశాక మిగిలిన ఉల్లిని బుధవారం పంపిణీ చేస్తామని రైతుబజారు ఎస్టేట్‌ ఆఫీసర్‌ అక్తర్‌ చెప్పారు. కాగా తేమగా వుండిన ఉల్లి లోడ్‌ను నాలుగైదురోజులకు ముందుగా లోడ్‌ చేయడంతో చాలావరకు స్టాకు కుళ్ళిపోయింది.స్టాకు పెద్దసైజులో వున్నప్పటికీ ఆశించినంత నాణ్యత లేకపోవడంతో కొన్న జనం నిరాశకు గురయ్యారు. 

Updated Date - 2020-10-28T10:58:54+05:30 IST