ఉచిత విద్యుత్‌’ పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి

ABN , First Publish Date - 2020-09-29T12:12:39+05:30 IST

వైఎస్సార్‌ ఉచిత వ్యవసాయ విద్యుత్‌ పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని డిప్యూటీ సీఎం కళత్తూరు నారాయణస్వామి పిలుపునిచ్చారు.

ఉచిత విద్యుత్‌’ పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి

డిప్యూటీ సీఎం కళత్తూరు నారాయణస్వామి


చిత్తూరు కలెక్టరేట్‌, సెప్టెంబరు 28: వైఎస్సార్‌ ఉచిత వ్యవసాయ విద్యుత్‌ పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని డిప్యూటీ సీఎం కళత్తూరు నారాయణస్వామి పిలుపునిచ్చారు. సోమవారం పీవీకేఎన్‌ డిగ్రీ కళాశాల మైదానంలో వైఎస్సార్‌ జలకళ బోర్‌వెల్స్‌ వాహనాలను జెండా ఊపి ప్రారంభించి, ప్రసంగించారు. ప్రజా సంకల్పయాత్రలో రైతుల కష్టాలను చూసి వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చడంలో భాగంగా.. బోర్లను ఉచితంగా వేయిస్తానని సీఎం జగన్‌ హామీ ఇచ్చారన్నారు.


దీని అమలు దిశగా ప్రస్తుతం చర్యలు చేపడుతున్నారని చెప్పారు. ఎమ్మెల్యేలు నవాజ్‌బాషా, బియ్యపు మధుసూదన్‌రెడ్డి, కలెక్టర్‌ భరత్‌గుప్తా, జేసీలు చంద్రమౌళి, వీరబ్రహ్మం, చిత్తూరు మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కృష్ణారెడ్డి, జిల్లా అధికారులు, పాల్గొన్నారు. అంతకుముందు కలెక్టరేట్‌లో సీఎం నిర్వహించిన వైఎస్సార్‌ జలకళ  వీడియో కాన్ఫరెన్స్‌కు డిప్యూటీ సీఎంతోపాటు కలెక్టర్‌ ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2020-09-29T12:12:39+05:30 IST