తగ్గుతోన్న కరోనా ఉధ్రుతి

ABN , First Publish Date - 2020-09-29T12:17:25+05:30 IST

కొద్ది రోజులుగా జిల్లాలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతూ వస్తోంది. దీనికి కారణం వైరస్‌ వ్యాప్తి తగ్గడమా లేక అధికార యంత్రాంగం టెస్టుల సంఖ్య తగ్గించడమా అన్నదానిపై స్పష్టత రావాల్సి వుంది.గడిచిన 24 గంటల వ్యవ

తగ్గుతోన్న కరోనా ఉధ్రుతి


తాజా కేసులు 286మాత్రమే


తిరుపతి, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): కొద్ది రోజులుగా జిల్లాలో కరోనా కేసుల సంఖ్య  తగ్గుముఖం పడుతూ వస్తోంది. దీనికి కారణం వైరస్‌ వ్యాప్తి తగ్గడమా లేక అధికార యంత్రాంగం టెస్టుల సంఖ్య తగ్గించడమా అన్నదానిపై స్పష్టత రావాల్సి వుంది.గడిచిన 24 గంటల వ్యవధిలో మరో 286 మందికి  జిల్లాలో కరోనా వైరస్‌ సోకినట్టు అధికార యంత్రాంగం గుర్తించింది.


ఆదివారం రాత్రి నుంచీ సోమవారం ఉదయం 9 గంటల వరకూ 52 మంది బాధితులను గుర్తించగా సోమవారం ఉదయం నుంచీ సాయంత్రం 5 గంటల వరకూ మరో 234 మందిని గుర్తించారు.వీటిల్లో తిరుపతి నగరంలో 55, తిరుపతి రూరల్‌లో 25, చిత్తూరు, మదనపల్లె మండలాల్లో 16 చొప్పున, వడమాలపేటలో 13, పీలేరు, రేణిగుంట, శ్రీకాళహస్తి, వాల్మీకిపురం మండలాల్లో 7 చొప్పున, ఐరాల, కుప్పం మండలాల్లో 6 వంతున, కలికిరి, పూతలపట్టు, పుత్తూరు మండలాల్లో 5 వంతున, గంగవరం, పాకాల, పుంగనూరు, శాంతిపురం మండలాల్లో 4 వంతున, చంద్రగిరి, కలకడ, నగరి, పలమనేరు, తవణంపల్లె, ఏర్పేడు మండలాల్లో 3 వంతున, జీడీనెల్లూరు, పెద్దమండ్యం, పెనుమూరు, శ్రీరంగరాజపురం, తొట్టంబేడు మండలాల్లో 2 చొప్పున, బి.కొత్తకోట, బంగారుపాళ్యం, చిన్నగొట్టిగల్లు, కేవీబీపురం, కార్వేటినగరం, నిండ్ర, పులిచెర్ల, రామకుప్పం, తంబళ్ళపల్లె, యాదమరి మండలాల్లో ఒక్కొక్కటి వంతున కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి జిల్లాలో ఇప్పటి వరకూ నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 62811కు చేరుకుంది.కాగా కరోనాతో మరో ఆరుగురు చనిపోయారు.వీరితో కలిపి మృతుల సంఖ్య 641కి చేరింది.


కొవిడ్‌ సెంటర్లలో 3046 పడకల ఖాళీ 

తిరుపతిలో ప్రభుత్వ కొవిడ్‌ ఆస్పత్రులు, కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో  ఆదివారం రాత్రి 10  గంటలకు 3,046 పడకలు ఖాళీగా ఉన్నాయి. వీటిలో 2,865 సాధారణ, 181 ఆక్సిజన్‌ బెడ్లున్నాయి. సాధారణ పడకలకు సంబంధించి రుయాలో 136, స్విమ్స్‌ 148, ఈఎస్‌ఐలో  27,  విష్ణు  నివాసంలో  273 (డార్మెటరీ), 258 (గదుల్లో).. మాధవంలో 362, పద్మావతి నిలయంలో 85, గోవిందరాజసత్రంలో 852, శ్రీనివాసంలో 702, టీటీడీ ఉద్యోగులకు 22 ఖాళీగా ఉన్నాయి. ఇక ఆక్సిజన్‌ బెడ్స్‌ రుయాలో 100, ఈఎస్‌ఐ ఆస్పత్రిలో 32, ఐసీయూలో  బెడ్స్‌ రుయాలో 8, ఈఎస్‌ఐ ఆస్పత్రిలో 41 అందుబాటులో ఉన్నాయి.

Updated Date - 2020-09-29T12:17:25+05:30 IST