Abn logo
Jul 29 2021 @ 08:21AM

PM Modi tweets Excellent video: 3వేల కృష్ణ జింకలు రోడ్డు దాటుతున్నాయి...

భావ్‌నగర్ (గుజరాత్): అటవీప్రాంతంలో చెంగుచెంగున దూకుతూ రోడ్డు దాటుతున్న అద్భుత వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గుజరాత్ రాష్ట్రంలోని అడవిలో 3వేల కృష్ణ జింకలు రోడ్డు దాటుతున్న అద్భుతమైన వీడియోను ప్రధానమంత్రి నరేంద్రమోడీ తాజాగా ట్వీట్ చేశారు. ప్రధానమంత్రి మోదీ షేర్ చేసిన వీడియోలో పెద్దసంఖ్యలో కృష్ణజింకలు రోడ్డు దాటుతున్నాయి. గుజరాత్ రాష్ట్రంలోని భావనగర్ లోని కృష్ణజింకల జాతీయ పార్కులో చిత్రీకరించిన ఈ వీడియోను గుజరాత్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ డిపార్టుమెంట్ ఆఫ్ ఇన్ ఫర్మేషన్ షేర్ చేసింది. దీంతో అద్భుతమైన ఈ వీడియోను ప్రధాని ట్వీట్ లో పంచుకున్నారు. ‘అద్భుతం’అనే క్యాప్షన్ తో ప్రధాని మోదీ షేర్ చేసిన ఈ వీడియో అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. 3వేల కృష్ణ జింకలు రెండు బారులుగా తీరి చెంగుచెంగున దూకుతూ రోడ్డు దాటుతున్న అరుదైన వీడియోను చూసిన నెటిజన్లు వావ్ అంటూ ప్రశంసించారు. ఒక గంట క్రితం మోదీ షేర్ చేసిన ఈ వీడియోకు 22,600 మందికి పైగా నెటిజన్ల నుంచి లైక్ లు వచ్చాయి. అద్భుతమైన ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఎమోజీలతో చప్పట్ల వర్షం కురిపించారు.



ప్రత్యేకంమరిన్ని...