త్వరలో రైతుల వద్దకు: జగ్గారెడ్డి

ABN , First Publish Date - 2021-12-26T01:23:18+05:30 IST

త్వరలో కల్లాల్లో అవస్థలు పడుతున్న రైతుల వద్దకు తాను

త్వరలో రైతుల వద్దకు: జగ్గారెడ్డి

హైదరాబాద్‌: త్వరలో కల్లాల్లో అవస్థలు పడుతున్న రైతుల వద్దకు తాను వెళ్తానని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తెలిపారు. నగరంలో ఆయ విలేకరులతో మాట్లాడారు. వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నాయన్నారు. వరి ధాన్యం కొనబోమని గతంలో ఏ ప్రభుత్వం చెప్పలేదన్నారు. తెలంగాణలో ఇప్పుడు వరి కొనుగోలు సమస్య ఎందుకొచ్చిందన్నారు.  రైతుల పాలిట కేసీఆర్, మోదీ రాక్షసులుగా మారారన్నారు. బకాసురులుగా మారి రైతుల ప్రాణాలు తీస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ, టిఆర్ఎస్ మధ్య కుదిరిన ఒప్పందం ఏంటని ఆయన ప్రశ్నించారు. రెండు పార్టీలు ఒకరిపై మరోకరు యుద్ధం చేస్తున్నట్టు నటిస్తున్నాయని ఆయన ఆరోపించారు.


ఇక్కడ కాంగ్రెస్ బలపడకుండా టీఆర్ఎస్‌ను బీజేపీ ఆడిస్తోందన్నారు. మోసం చేసినా రైతులు తమ వెంటే ఉంటారని బీజేపీ, టిఆర్ఎస్ ధీమాగా ఉన్నాయన్నారు.  త్వరలో రైతుల వద్దకు వెళ్తానన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డ్రామాలు ఎండగడతానన్నారు. ప్రభుత్వం మంచి చేస్తే సమర్థిస్తామని, మంచి చేయకపోతే ప్రశ్నిస్తామని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో బీజేపీకి స్థానం లేదన్నారు. 


Updated Date - 2021-12-26T01:23:18+05:30 IST