కేసీఆర్‌ కుటుంబాన్ని.. పొలిమేరల దాకా తరిమేద్దాం

ABN , First Publish Date - 2022-06-04T09:25:59+05:30 IST

‘‘తెలంగాణలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ఆత్మగౌరవం, స్వయం పాలన సామాజిక న్యాయం కోసం తెలంగాణ తెచుకున్నాం. ఏ లక్ష్యం కోసమైతే

కేసీఆర్‌ కుటుంబాన్ని.. పొలిమేరల దాకా తరిమేద్దాం

అప్పటివరకు పోరాటం సాగిస్తా.. తల తెగిపడ్డా వెనకడుగు వెయ్యను 

 పదవులు, పైసలు కావాలంటే ఏ పార్టీ అయినా ఇస్తుంది

జైలు కూడు తిన్న తర్వాత ధైర్యం పెరిగింది

2023లో కాంగ్రెస్‌ గెలుపు కోసం కృషి చేయండి :  రేవంత్‌

తమతో కలిసి రావాలని అమెరికాలోని తెలంగాణ ప్రవాసులకు పిలుపు


హైదరాబాద్‌, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి): ‘‘తెలంగాణలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ఆత్మగౌరవం, స్వయం పాలన సామాజిక న్యాయం కోసం తెలంగాణ తెచుకున్నాం. ఏ లక్ష్యం కోసమైతే రాష్ట్రాన్ని తెచుకున్నామో ఇప్పుడు ఆ లక్ష్యం నెరవేరడం లేదు. సీఎం కేసీఆర్‌ కుటుంబం చేతిలో తెలంగాణ బందీ అయ్యింది. కేసీఆర్‌, కొడుకు, అల్లుడు, బిడ్డ, సడ్డకుడి కొడుకు, వాళ్ల బంధువులు వేల కోట్ల రూపాయలు సంపాదించి రాష్ట్రాన్ని బందీ చేశారు. ప్రజలకు అప్పులు, ఆత్మహత్యలే మిగిలాయి. ఉద్యోగాలు లేవు. ఉద్యోగులకు సకాలంలో జీతాలు లేవు. ముసలోళ్లకు పెన్షన్లు లేవు. ఈ బానిస బతుకు నుంచి విముక్తి కోసం కొట్లాడుదాం. మీరు మాతో కలిసి రండి. తల తెగి పడ్డా వెనుకడుగు వెయ్యబోను. కేసీఆర్‌ కుటుంబాన్ని తెలంగాణ పొలిమేరల దాకా తరిమికొట్టేదాకా పోరాడదాం’’ అని అమెరికాలోని తెలంగాణ ప్రవాసులకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. డల్లాస్‌ నగరంలో నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సభలో ఆయన మాట్లాడారు. ‘ఉద్యమంలో ఎంతో మంది యువకులు, విద్యార్థులు ప్రాణ త్యాగాలు చేశారు. వారి త్యాగం, కాంగ్రెస్‌ అధినేత్రి సోనియమ్మ దీవెన వల్ల రాష్ట్రం వచ్చింది. తెలంగాణలో కాంగ్రె్‌సను అధికారంలోకి తెచ్చి సోనియమ్మకు బహుమతిగా ఇవ్వాలి. నాకు పదవులు, పైసలు కావాలంటే ఏ పార్టీ అయినా ఇస్తుంది. తరతరాలు కూర్చొని తిన్న తరగని సంపదను పోగు చేసుకోవచ్చు. అయినా లొంగకుండా ప్రజల తరఫున పోరాటం సాగిస్తున్నా.


ప్రజాస్వామ్య స్ఫూర్తిని తుంగలో తొక్కి అధికార పక్షానికి లొంగిపోయి చరిత్ర హీనుడిగా మిగిలిపోదల్చుకోలేదు. 120 కేసులు పెట్టి జైళ్లలో వేసినప్పటికీ భయపడలేదు.. తెలంగాణ ప్రజల మీద మాకు ఉన్న బాధ్యతతో నిలబడి కోట్లాడుతున్నా. అప్పట్లో జైళ్లో చిప్పకూడు తిన్నవు అని ఏవరో వ్యాఖ్యానించారు. ఆ చిప్పకూడు తిన్న తర్వాతే నాలో గుండె ధైర్యం పెరిగింది. చర్లపల్లి జైళ్లో తిన్న చిప్ప కూడు మీద ఒట్టేసి చెబుతున్న కేసీఆర్‌ను పాతళానికి తొక్కే బాధ్యత నేను తీసుకుంటా. కేసీఆర్‌ కుటుంబం నుంచి తెలంగాణకు విముక్తి కల్పించే వరకు  పోరాటం చేస్తూనే ఉంటా. ఆ పోరాటంలో ప్రాణాలు పోయిన ఫర్వాలేదు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్‌ గెలవాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం పార్టీ బలోపేతానికి మీ వంతు కృషి చేయండి’’ అని రేవంత్‌ విజ్ఞప్తి చేశారు. 

Updated Date - 2022-06-04T09:25:59+05:30 IST