కేటీఆర్‌కు అసలు కేసీఆర్ చరిత్ర తెలుసా?: Revant reddy

ABN , First Publish Date - 2022-05-08T21:13:08+05:30 IST

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని విమర్శించిన మంత్రి కేటీఆర్ (ktr)కు అసలు కేసీఆర్(kcr) చరిత్ర తెలుసా? అని టీపీసీసీ ప్రెసిడెంట్ Revant reddy ప్రశ్నించారు.

కేటీఆర్‌కు అసలు కేసీఆర్ చరిత్ర తెలుసా?: Revant reddy

హైదరాబాద్: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని విమర్శించిన మంత్రి కేటీఆర్ (ktr)కు అసలు కేసీఆర్(kcr) చరిత్ర తెలుసా? అని టీపీసీసీ ప్రెసిడెంట్ Revant reddy ప్రశ్నించారు. కేసీఆర్‌కు రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్ అన్న విషయం తెలియదా? అన్నారు.అలాంటి పార్టీని విమర్శిస్తారా?అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి కేటీఆర్ రాహుల్ పై చేసిన విమర్శలకు రేవంత్ రెడ్డి స్పందించారు. కేసీఆర్ రాజకీయ ప్రస్థానం ఓటమితోనే ప్రారంభమైందన్న విషయాన్ని కేటీఆర్ గుర్తుంచుకోవాలని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రజాగ్రహ భయంతో కేసీఆర్‌ వేర్వేరు చోట్ల ఎంపీగా పోటీచేశారన్న సంగతి మర్చిపోయారా? అంటూ గుర్తు చేశారు.


అవకాశమున్నా కూడా ప్రధాని పదవిని సోనియా, రాహుల్ చేపట్టలేదన్న విషయం కేటీఆర్ తెలుసుకోవాలన్నారు. రాహుల్‌గాంధీ గురించి మాట్లాడే అర్హత కేటీఆర్‌కు లేదని రేవంత్ రెడ్డి అన్నారు.వరంగల్ డిక్లరేషన్‌కు మద్దతుగా రాహుల్‌గాంధీ మాట్లాడారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడి హోదాలో వచ్చిన రాహుల్‌ను ప్రశ్నిస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్.. శరద్‌పవార్, స్టాలిన్, మమతాబెనర్జీ దగ్గరకు వెళ్లిరావచ్చు. రాహుల్ పొలిటికల్ టూరిస్ట్ అయితే.. మరి కేసీఆర్‌ను ఏమనాలి?అంటూ ప్రశ్నించారు.బీజేపీ, టీఆర్ఎస్, ఎంఐఎం ఒకే భావజాలంతో పనిచేస్తున్నాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. 

Read more