కవిత - రేవంత్ మధ్య ట్వీట్ వార్

ABN , First Publish Date - 2022-05-06T15:39:15+05:30 IST

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మధ్య ట్వీట్ వార్ నడుస్తోంది.

కవిత - రేవంత్ మధ్య ట్వీట్ వార్

హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మధ్య ట్వీట్ వార్ నడుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీపై కవిత చేసిన వ్యాఖ్యలపై రేవంత్ కౌంటర్ ఇచ్చారు. ‘‘మోదీ రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు. మీ తండ్రి మోదీ ముందు మోకరిల్లి బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని లేఖ ఇచ్చి రైతులకు ఉరి తాళ్లు బిగించినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు. వరి వేస్తే ఉరే అని మీ తండ్రి ప్రవచనాలు చెప్పి ఫామ్ హౌజ్‌లో వరి వేసినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు. అకాల వర్షాలతో కల్లాల్లో ధాన్యం రాశులు తడిసి రైతులు బోరున విలపిస్తున్నారు.. వారి కష్టం పట్టించుకోకుండా మీరు ఎక్కడ’’ అంటూ రేవంత్ ట్వీట్ చేశారు. 

Read more