నిజామాబాద్: బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఆందోళనలకు మద్దతు తెలుపుతూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth reddy) బాసరకు బయలుదేరారు. పోలీసుల తనిఖీలను తప్పించుకుని మరీ రేవంత్ బాసరకు పయనమయ్యారు. ఇందల్ వాయి టోల్‌గేటు వద్దకు రేవంత్ రెడ్డి వాహనాలు చేరుకోగా పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అయితే అందులో రేవంత్ రెడ్డి లేనట్లు గుర్తించారు. మారువేషంలో ద్విచక్ర వాహనంపై సరిహద్దు దాటుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో నిజామాబాద్, నిర్మల్ జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. బాసర నలువైపులా తనిఖీలను మరింత ముమ్మరం చేశారు.
ఇవి కూడా చదవండి