Advertisement
Advertisement
Abn logo
Advertisement

మొదటి రోజే వెనక్కి తీసుకుంటే రైతుల ప్రాణాలు మిగిలేవి: Revanth

హైదరాబాద్: మూడు వ్యవసాయచట్టాలపై నిర్ణయాన్ని మొదటి రోజే వెనక్కి తీసుకుంటే రైతుల ప్రాణాలు మిగిలేవని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. వ్యవసాయ చట్టాలకు సంబంధించి ప్రధాని ప్రకటనపై రేవంత్ మాట్లాడుతూ 13 నెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు అకుంఠిత దీక్షతో పోరాటం చేశారన్నారు. ప్రభుత్వం మెడలు వంచి.. నల్ల చట్టాలు వెనక్కి తీసుకునేలా పోరాటం చేశారని తెలిపారు. దేశ సరిహద్దుల్లో సైన్యం ఎలా పోరాటం చేస్తారో... రైతులు కూడా అదే స్ఫూర్తితో ఉద్యమం చేశారన్నారు. దేశంలో గుజరాత్ నుండి బయలు దేరిన నలుగురు దేశాన్ని అక్రమించుకోవలని చూస్తున్నారని మండిపడ్డారు.


వ్యవసాయం అదాని..అంబానీకి అమ్మకానికి పెట్టాలని చూశారన్నారు. ఇందిరాగాంధీ పుట్టిన రోజున నల్ల చెట్టాల రద్దుతో రైతులు విజయం సాధించారని టీపీసీసీ చీఫ్ అన్నారు. వందలాది మంది రైతుల ప్రాణాలు పోవడానికి కారణం అయిన నరరూప రాక్షసుడు మోదీని వ్యాఖ్యానించారు. రైతులు మోడీని క్షమించరన్నారు. వ్యవసాయం సంక్షోభానికి  కారణం మోడీ, కేసీఆర్ అని అన్నారు. పార్లమెంట్‌లో చట్టానికి అనుకూలంగా కేసీఆర్ ఓటేశారని గుర్తుచేశారు. సభలో చట్టాలకు వ్యతిరేకంగా తీర్మానం చేసే ధైర్యం లేదు కానీ...క్రెడిట్ మాత్రం తనదే అని అంటున్నారని...అది రైతులను అవమానించడమే అని రేవంత్ రెడ్డి అన్నారు. 

Advertisement
Advertisement