హుజూరాబాద్ ఎన్నికల్లో పెద్ద బకరా హరీష్ రావే: Revanth

ABN , First Publish Date - 2021-10-08T18:46:44+05:30 IST

కేంద్రంతో పోరాటం అనేది సుద్ద తప్పు అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ యూపీ ఎలక్షన్ల కోసమే మోదీ, అమిత్ షా కేసీఆర్‌ను దగ్గరకు తీస్తున్నారని తెలిపారు.

హుజూరాబాద్ ఎన్నికల్లో పెద్ద బకరా హరీష్ రావే: Revanth

హనుమకొండ: కేంద్రంతో పోరాటం అనేది సుద్ద తప్పు అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ యూపీ ఎలక్షన్ల కోసమే మోదీ, అమిత్ షా కేసీఆర్‌ను దగ్గరకు తీస్తున్నారని తెలిపారు. కేసీఆర్ ఎంత అవినీతి చేసినా కేంద్ర దర్యాప్తు సంస్థలు ఒక్క కేసు కూడా పెట్టలేదన్నారు. కిషన్ రెడ్డి హైదరాబాద్‌కు వచ్చిన ప్లైట్ కేసీఆరే అరెంజ్ చేశారని తెలిపారు. హుజూరాబాద్ ఎన్నికల్లో పెద్ద బకరా హరీష్ రావే అని వ్యాఖ్యానించారు. కేటీఆర్‌ను ముఖ్యమంత్రి చేసేందుకు హరష్‌ను కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఒకవేళ ఈటల రాజేందర్ గెలిస్తే బండి సంజయ్‌కు ప్రమాదమని, ఆ తర్వాత కిషన్ రెడ్డికే ప్రమాదమన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ రెండు పార్టీల వైఖరిని హుజూరాబాద్ ఎన్నికల ప్రచారంలో ఎండగడతామని రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. 

Updated Date - 2021-10-08T18:46:44+05:30 IST