అధికారులపై చర్యలు తీసుకోవాలి: రేవంత్ రెడ్డి

ABN , First Publish Date - 2021-12-26T01:51:25+05:30 IST

నగరంలోని కేపీహెచ్‌బీకాలనీ 4వ ఫేజులో జరిగిన ఘటనకు

అధికారులపై చర్యలు తీసుకోవాలి: రేవంత్ రెడ్డి

హైదరాబాద్: నగరంలోని కేపీహెచ్‌బీకాలనీ 4వ ఫేజులో జరిగిన ఘటనకు కారకులైన హౌసింగ్ బోర్డు అధికారులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. 4వ ఫేజులో సెల్లార్ నీటి గుంటలో పడి మృతిచెందిన ఒక్కొక్కరికి 20వేల రూపాయలు ఆర్ధిక సహాయం అందిస్తామని ఆయన ప్రకటించారు. తమ పార్టీ నాయకులు ఈ సహాయాన్ని అందిస్తారని  రేవంత్ హామీ ఇచ్చారు. తల్లిదండ్రులకు కూడా సరైన సమాచారం ఇవ్వకుండా బాలిక మృతదేహలకు పోలీసులు దహన సంస్కారాలు చేసారని ఆయన ఆరోపించారు.


ఈ దుర్ఘటన జరిగిన తరువాత ఏ మంత్రి కూడా బాధిత కుటుంబాలను పరామర్శిచట లేదన్నారు. హైదరాబాదులో నగరంలో ఎంత మంది చనిపోయినా కేటిఆర్‌కు చీమకుట్టినట్లు లేదన్నారు.  ప్రజల ప్రాణాలు పోతున్నా హౌసింగ్ బోఅర్డు అధికారులు తూతూ మంత్రంగా చర్యలు చేపడుతున్నారని ఆయన ఆరోపించారు. విధులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న హౌసింగ్ బోర్డు అధికారులుపై వెంటనే పోలీసులు హత్యా నేరం కింద కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలన్నారు. బాధిత కుటుంబాలకు నష్ట పరిహారం అందించాలన్నారు. 




అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారుల పాలిట శాపంగా మారింది. కేపీహెచ్‌బీలో దారుణం చోటుచేసుకుంది. అభం శుభం తెలియని ముగ్గురు చిన్నారులు  సంగీత (12),  సోఫియా(10),  కూతురు రమ్య (7)ఆడుకుంటూ వెళ్లి సెల్లార్‌ నీటిగుంతలో పడి మృత్యువాత పడిన సంగతి తెలిసిందే హౌసింగ్‌బోర్డు స్థలంలో పదేళ్ల క్రితం బహుళ అంతస్తు నిర్మాణాల కోసం సెల్లార్‌ గుంత తవ్వి నిర్లక్ష్యంగా వదిలేయడంతోనే ఈ దారుణం చోటుచేసుకుంది.

Updated Date - 2021-12-26T01:51:25+05:30 IST