ఢిల్లీ: టీఆర్ఎస్ ఎంపీలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. వరి ధాన్యం కొనుగోళ్లంటూ విషయాన్ని పక్కదారి పట్టించి పార్లమెంట్ నుంచి టీఆర్‌ఎస్ సభ్యులు నిష్క్రమించారని ఆయన ఆరోపించారు. ఈడీ నోటీసుల క్రమంలో కేసీఆర్‌కు, కేంద్రానికి కొంత అంతరం ఏర్పడిందన్నారు. ఈడీ విచారణ నుంచి తప్పించుకోవడానికే పార్లమెంట్‌ను వేదికగా వాడుకుని టీఆర్‌ఎస్ డ్రామాలాడిందన్నారు. ఈడీ నోటీసులను కేంద్రం తాత్కలికంగా నిలిపివేసిందన్నారు.