Abn logo
Oct 23 2021 @ 18:13PM

అవును.. ఈటల రాజేందర్‌ను కలిశాను: రేవంత్‌రెడ్డి

కరీంనగర్:  తనపై మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు. బీజేపీ నేత ఈటల రాజేందర్‌ను తాను బహిరంగంగానే కలిశానని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి స్పష్టం చేసారు. వేం నరేందర్‌రెడ్డి కొడుకు పెళ్లి పత్రిక సందర్భంగా నేతలందరం కలిశామన్నారు. మే 7న ఈ కార్యక్రమం గోల్కొండ రిసార్టులో జరిగిందన్నారు. ఈటలను తాను చీకట్లో కలవలేదన్నారు. కేసీఆర్‌ కుట్రలను తనతో ఈటల చెప్పారని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. కిషన్‌రెడ్డితో ఈటల భేటీని ఏర్పాటు చేసింది కేసీఆర్‌, కేటీఆర్‌ కాదా అని ఆయన ప్రశ్నించారు. కిషన్‌రెడ్డికి ప్రత్యేక విమానం ఇచ్చింది మీ కాంట్రాక్టర్‌ కాదా అని రేవంత్ నిలదీసారు.