టీఆర్‌ఎస్‌, బీజేపీ చిల్లర రాజకీయాలు: రేవంత్ రెడ్డి

ABN , First Publish Date - 2022-07-02T22:55:32+05:30 IST

ప్రజా సమస్యలను గాలికొదిలి టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు చిల్లర రాజకీయాలుచేస్తున్నాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు

టీఆర్‌ఎస్‌, బీజేపీ చిల్లర రాజకీయాలు: రేవంత్ రెడ్డి

హైదరాబాద్: ప్రజా సమస్యలను గాలికొదిలి టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు చిల్లర రాజకీయాలుచేస్తున్నాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు.కల్లు కంపౌండ్‌లో కల్తీ కల్లు తాగినట్లుగా వ్యవహరిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. శనివారం మీడియా సమావేశంలో మాట్లాడిన రేవంత్ రెడ్డి బిజెపి, టీఆర్ఎస్ పార్టీలపై తీవ్రంగా స్పందించారు.కార్పొరేట్ కంపెనీల డబ్బులతో బీజేపీ కార్యవర్గ సమావేశాలు నిర్వహించుకుంటోందన్నారు.ఎనిమిదేళ్లుగా తెలంగాణకు కేంద్రం చిల్లి గవ్వ ఇవ్వలేదని రేవంత్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రయోజనాలపై కేంద్రాన్ని కేసీఆర్‌ ఎందుకు ప్రశ్నించట్లేదని అన్నారు. 


కేంద్రం రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తీసుకొస్తే 16 నెలలుగా అటువైపు కేసీఆర్ కన్నెత్తి కూడా చూడలేదన్నారు. జీఎస్టీ ద్వారా జరిగిన అన్యాయంపై కేసీఆర్‌ ప్రశ్నించలేదని అన్నారు.సమస్యల పట్ల చర్చ జరగకుండా ప్లెక్సీలతో రెండు పార్టీలు చిల్లర తగాదాలు చేస్తున్నారని ఆరోపించారు.అగ్నిపథ్ పథకంపై మోదీని కేసీఆర్‌ ప్రశ్నించాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఇందిరాగాంధీ విగ్రహానికి కూడా టీఆర్ఎస్ జెండాలు కట్టారు.ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయడం దేనికి సంకేతమని  రేవంత్‌ ప్రశ్నించారు.ఇలాంటి చిల్లర రాజకీయాలు మానుకోకపోతే కేసీఆర్, కేటీఆర్‌ల వీపులకు కాంగ్రెస్ జెండాలు కడతామని రేవంత్‌ హెచ్చరించారు. 

Updated Date - 2022-07-02T22:55:32+05:30 IST