టయోటా అర్బన్‌ క్రూయిజర్‌

ABN , First Publish Date - 2020-09-24T06:27:00+05:30 IST

జపాన్‌ ఆటో దిగ్గజం టయోటా కాంపాక్ట్‌ ఎస్‌యూవీ ‘అర్బన్‌ క్రూయిజర్‌’ను మార్కెట్లోకి విడుదల చేసింది.

టయోటా అర్బన్‌ క్రూయిజర్‌

ధర రూ.8.4 లక్షలు


న్యూఢిల్లీ: జపాన్‌ ఆటో దిగ్గజం టయోటా కాంపాక్ట్‌ ఎస్‌యూవీ ‘అర్బన్‌ క్రూయిజర్‌’ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కొత్త కారు ప్రారంభ ధర (ఢిల్లీ ఎక్స్‌ షోరూమ్‌) రూ.8.4 లక్షలు. గరిష్ఠ రేటు రూ.11.30 లక్షలు. మాన్యువల్‌, ఆటో ట్రాన్స్‌మిషన్‌ ఆప్షన్‌లో మూడేసి వేరియంట్ల (మిడ్‌, హై, ప్రీమియం)లో  లభించనుంది. జపాన్‌కు చెందిన మరో వాహన కంపెనీ సుజుకీతో టయోటా గతంలో అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. ఆ భాగస్వామ్యం ద్వారా భారత్‌లో టయోటా ప్రవేశపెట్టిన రెండో కారు ఇది. ఇంతక్రితం గ్లాంజా పేరుతో హ్యచ్‌బ్యాక్‌ కారును విడుదల చేసింది. టయోటా అర్బన్‌ క్రూయిజర్‌.. మారుతి సుజుకీ విటారా బ్రెజ్జాకు క్రాస్‌ బ్యాడ్జ్‌ వెర్షన్‌. 

Updated Date - 2020-09-24T06:27:00+05:30 IST