రామగుండంలో టౌన్‌ప్లానింగ్ డైరెక్టర్ పర్యటన
ABN , First Publish Date - 2022-06-26T06:24:12+05:30 IST
రామగుండం నగరపాలక సంస్థలో శనివారం టౌన్‌ప్లానింగ్ డైరెక్టర్ విద్యాధర్ పర్యటించారు.
- ఆర్ఎఫ్సీఎల్ పరిశీలన
కోల్‌సిటీ, జూన్ 25: రామగుండం నగరపాలక సంస్థలో శనివారం టౌన్‌ప్లానింగ్ డైరెక్టర్ విద్యాధర్ పర్యటించారు. కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా టౌన్ ప్లానింగ్ విభాగంలో కట్టడాలపై ఆరా తీశారు. మాస్టర్ ప్లాన్ ప్రిపరేషన్, అభ్యంతరాల విషయమై ఆరాతీశారు. పూర్తి వివరాలతో హైదరా బాద్‌కు రావాలని సూచించారు. నగరపాలక సంస్థ ఆర్ఎఫ్సీఎల్కు అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో ఆర్ఎఫ్సీఎల్ను పరిశీలించారు. ఆర్ఎఫ్సీఎల్ అనుమతుల ప్ర కారం నిర్మాణాలు ఉన్నాయా అనే విషయంపై ఆరా తీశారు. ఆర్ఎఫ్సీఎల్ అధికారి సౌరభ్ ప్లాంట్‌లోని వివిధ లొకేషన్లను ఆయనకు చూపించారు. రామగుండం పర్య టనకు వచ్చిన టౌన్‌ప్లానింగ్ డైరెక్టర్ విద్యాధర్‌ను మేయర్ అనీల్‌కుమార్ సత్కరిం చారు. డైరెక్టర్ వెంట ఏసీపీలు వీబీ శ్రీనివాసరావు, మాతంగి శ్రీనివాస్, టీపీఎస్ ప్రశాంత్, టీపీబీఓ సంజన, పెద్దపల్లి పీటీఓ అభినవ్ పాల్గొన్నారు.