లక్ష్యం దిశగా..!

ABN , First Publish Date - 2021-12-09T05:18:18+05:30 IST

జిల్లాలో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ల క్ష్యాన్ని వందశాతం పూర్తి చేసేందుకు పలు శాఖల సమన్వయంతో యాక్షన్‌ ప్లాన్‌ కొనసాగుతోంది. ఈ మేరకు జిల్లావ్యాప్తంగా వందశాతం వ్యాక్సినేషన్‌ లక్ష్యాన్ని సాధించేందుకు కలెక్టర్‌ ముషా రఫ్‌ అలీ ఫారూఖీ నేతృత్వంలో వైద్యారోగ్య శాఖ నిమగ్నమైంది. వ్యాక్సినేషన్‌ కోసం కఠిన నిబంధనలు అమలు పరుస్తు న్నప్పటికీ పూర్తిస్థాయిలో ఇప్పటి వరకు లక్ష్యం నెరవేరలేదు. దీంతో కలెక్టర్‌ సీరియస్‌గా స్పందించి ప్రభుత్వ ఉద్యోగులు, ఉపా ధ్యాయులు, సెల్ఫ్‌హెల్ప్‌ గ్రూప్‌ మహిళలు, విద్యార్థులపై దృష్టి కేంద్రీకరించారు.

లక్ష్యం దిశగా..!
కడెంలో వ్యాక్సిన్‌ తీరును పరిశీలిస్తున్న అధికారులు (ఫైల్‌)

వ్యాక్సినేషన్‌పై అన్ని శాఖల సమన్వయం
రెండో డోస్‌కు 3 లక్షల మంది దూరం
మొత్తం 182 బృందాలు
ఇప్పటి వరకు వంద హ్యబిటేషన్లలో వందశాతం వ్యాక్సిన్‌


నిర్మల్‌, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ల క్ష్యాన్ని వందశాతం పూర్తి చేసేందుకు పలు శాఖల సమన్వయంతో యాక్షన్‌ ప్లాన్‌ కొనసాగుతోంది. ఈ మేరకు జిల్లావ్యాప్తంగా వందశాతం వ్యాక్సినేషన్‌ లక్ష్యాన్ని సాధించేందుకు కలెక్టర్‌ ముషా రఫ్‌ అలీ ఫారూఖీ నేతృత్వంలో వైద్యారోగ్య శాఖ నిమగ్నమైంది. వ్యాక్సినేషన్‌ కోసం కఠిన నిబంధనలు అమలు పరుస్తు న్నప్పటికీ పూర్తిస్థాయిలో ఇప్పటి వరకు లక్ష్యం నెరవేరలేదు. దీంతో కలెక్టర్‌ సీరియస్‌గా స్పందించి ప్రభుత్వ ఉద్యోగులు, ఉపా ధ్యాయులు, సెల్ఫ్‌హెల్ప్‌ గ్రూప్‌ మహిళలు, విద్యార్థులపై దృష్టి కేంద్రీకరించారు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యా యులకు వ్యాక్సినేషన్‌ నిర్బంధం చేశారు. వ్యాక్సినేషన్‌ తీసుకోని వా రికి జీతాలు నిలిపివేసేందుకు కూ డా సిద్ధమయ్యారు. దీంతో అందరిలో కదలిక మొదలైంది. కొద్దిరోజుల నుంచి వె లవెలబోయిన వ్యాక్సినేషన్‌ సెంటర్లన్నీ ప్రస్తు తం కిటకిటలాడుతున్నాయి.
ఐదు లక్షల మందికి మొదటి డోస్‌..
ఇప్పటి వరకు జిల్లాలో మొదటి డోస్‌ వ్యాక్సినేషన్‌ 5 లక్షల 7242 మంది తీసుకున్నారు. రెండోడోస్‌ 1,84,681 మంది తీసుకోవడం గమ నార్హం. జిల్లాలో ఇప్పటివరకు వంద హ్యబిటేషన్లలో వందశాతం వ్యా క్సినేషన్‌ పూర్తి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. జిల్లా వ్యాప్తంగా 182 బృందాలు వ్యాక్సినేషన్‌ కోసం రంగంలోకి దిగాయి. వీటి లో అర్బన్‌ ప్రాంతాల్లో 82 బృందాలు, గ్రామీణ ప్రాంతాల్లో వంద బృం దాలు కార్యాచరణలో పాల్గొంటున్నాయి. ప్రస్తుతం జిల్లాలో కోవ్యాక్సిన్‌, కొవిషీల్డ్‌ అందుబాటులో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. వైద్య ఆ రోగ్య శాఖతో పాటు రెవెన్యూ, పోలీస్‌, ఐకేపీ, ఎంపీడీవో, ఎంపీవో, అం గన్‌వాడీ ఉద్యోగులు ఇందులో పాలు పంచుకుంటున్నారు. మొదటి డో స్‌ తీసుకున్న వారందరినీ రెండోడోస్‌ తీసుకునే విధంగా చేయడమే ప్ర స్తుతం యంత్రాంగం టార్గెట్‌గా పెట్టుకుంది. మూడు లక్షల మందికి రెండో డోస్‌ వ్యాక్సిన్‌ చేపట్టాల్సి ఉందని అధికారులు పేర్కొంటున్నారు.
రెండో డోస్‌పై ప్రత్యేక దృష్టి..
జిల్లాలో ప్రస్తుతం రెండోడోస్‌కు యంత్రాంగమంతా ప్రాధాన్యత ఇ స్తోంది. మొదటి డోస్‌ ఐదు లక్షల మందికి పైగా తీసుకోగా, రెండోడోస్‌ లక్షా ఎనభై వేల మంది తీసుకోవడంతో మిగతా వారికి డోస్‌ను ఇప్పిం చే పనిలో వైద్యారోగ్య శాఖ అధికారులు నిమగ్నమయ్యారు. ఇంటింటికీ తిరుగుతూ రెండో డోస్‌పై ప్రచారం చేపడుతున్నారు. పూర్తిస్థాయి ల క్ష్యాన్ని సాధించేందుకు అన్ని శాఖలు సమన్వయంగా పనిచేస్తున్నాయి.
ఉమ్మడి కార్యాచరణ..
జిల్లాలో వందశాతం వ్యాక్సినేషన్‌ చేపట్టేందుకు కలెక్టర్‌ నేతృత్వంలో పలు శాఖలు ఉమ్మడి కార్యాచరణను చేపట్టాయి. వైద్య ఆరోగ్య శాఖతో పాటు రెవెన్యూ, పోలీస్‌, ఎంపీడీవో, అంగన్‌వాడీ ఉద్యోగులు స్పెషల్‌ డ్రైవ్‌ పేరిట వ్యాక్సినేషన్‌ కార్యక్రమం కొనసాగిస్తున్నాయి. రెండోడోస్‌తో పాటు ఇప్పటి వరకు వ్యాక్సినేషన్‌ తీసుకోని వారందరినీ గుర్తించే పని లో నిమగ్నమయ్యారు. జిల్లావ్యాప్తంగా 182 బృందాలు ఊరూరా తిరు గుతూ.. వ్యాక్సినేషన్‌ చేపడుతున్నారు. మారుమూల అటవీ గ్రామాల్లో సైతం వ్యాక్సినేషన్‌ కోసం ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. ము ఖ్యంగా పశువులు, మేకల కాపరుల కోసం వ్యాక్సినేషన్‌ వేసేందుకు అ డవుల్లో సైతం వైద్య ఉద్యోగులు తమ సేవలు అందిస్తున్నారు.

Updated Date - 2021-12-09T05:18:18+05:30 IST