డిజిటలైజేషన్‌ దిశగా..

ABN , First Publish Date - 2022-06-26T05:53:34+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాల్టీల పరి ధిలోని ఇళ్లకు డిజిటలైజేషన్‌ విధానం అమలు చేస్తోంది.

డిజిటలైజేషన్‌ దిశగా..
జగిత్యాల పట్టణం వ్యూ

- బల్దియాల్లో ప్రతీ ఇంటికి డిజిటల్‌ నంబరు

- ఆన్‌లైన్‌ విధానంతో మరింత సులభంగా...

- జిల్లాలో ఐదు మున్సిపాల్టీల్లో 77,507 గృహాలు

జగిత్యాల, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాల్టీల పరి ధిలోని ఇళ్లకు డిజిటలైజేషన్‌ విధానం అమలు చేస్తోంది. ఒకే నంబ రుతో రెండు ఇళ్లు, పన్నుల చెల్లింపులోనూ, ఇళ్లు క్రయ విక్రయాల సమయం లోనూ ఇబ్బందులు ఏర్పడుతుండేవి. దశాబ్ధాల క్రితం కేటాయించిన ఇం టి నంబర్లతో ఎదురవుతున్న గందరగోళ పరిస్థితులను నివారిం చేందుకు గాను రాష్ట్ర మున్సిపల్‌ శాఖ నూతన విధానం అమలు చేస్తోంది. మున్సి పాల్టీల పరిధిలో ప్రతీ ఇంటికి డిజిటల్‌ నంబరు కేటాయిం చాలని నిర్ణ యించింది. ఈమేరకు జిల్లాలోని మున్సిపల్‌ కమిషనర్లకు ఆదేశాలు అం దాయి. ఇప్పటికే భువన్‌ యాప్‌ ద్వారా నివాస గృహాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసిన నేపథ్యంలో, గృహాలకు ఆన్‌లైన్‌ విధానంలోనే నంబర్లను కేటాయించడానికి సిద్ధమవుతున్నారు.

జగిత్యాల జిల్లాలో పరిస్థితి....

జిల్లాలో జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, రాయికల్‌, ధర్మపురి పట్టణాలు మున్సిపల్‌ కేంద్రాలుగా కొనసాగుతున్నాయి. ఐదు మున్సిపాల్టీల్లో కలిపి 134 వార్డుల్లో 77,507 ఇళ్లున్నాయి. ఇందులో జగిత్యాల మున్సిపల్‌లో  30, 293 ఇళ్లు, కోరుట్లలో 22,115 ఇళ్లు, మెట్‌పల్లిలోని 16,301 ఇళ్లు, ధర్మపురి లో 4,118 ఇళ్లు, రాయికల్‌లో 4,680 ఇళ్లున్నాయి. 2011 జనాభా లెక్కల ప్ర కారం జిల్లాలో 9,85,417 జనాభా ఉంది. సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం జిల్లాలో 10,19,045 జనాభా ఉంది. జిల్లాలోని పట్టణ జనాభా 2,21,336 ఉండగా గ్రామీణ జనాభా 7,64,081 ఉంది. జగిత్యాల మున్సిపల్‌ జనాభా 1,03,930 కాగా, కోరుట్ల 66,504, మెట్‌పల్లి 50,902, రాయికల్‌ 18,372, ధర్మపురి మున్సిపల్‌లో 16,898 జనాభా ఉంది.

మరింత మెరుగైన సేవలు...

మున్సిపాల్టీల్లో డిజిటల్‌ నంబర్లను ఇళ్లకు కేటాయించడం వల్ల మరింత మెరుగైన సేవలు అందించాలన్న లక్ష్యంతో మున్సిపల్‌ శాఖ చర్యలు తీసు కుంటోంది. డిజిటల్‌ ఇంటి నంబర్లతో మున్సిపల్‌ పరిధిలోని ప్రజలకు పా రదర్శక పాలన అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆంగ్ల అక్షరాలతో పాటు సంఖ్యను సులభంగా గుర్తించేలా డిజిటల్‌ నంబర్‌ ప్లేట్‌ కేటాయిం చనున్నారు. పిన్‌ కోడ్‌ తరహాలో రాష్ట్ర, జిల్లా, మున్సిపల్‌, వార్డు తదితర సమాచారం తెలిసేలా కోడ్‌ వారిగా సంఖ్యను ఇళ్లకు కేటాయించనున్నారు. పట్టణాల్లో ఉండే అపార్ట్‌మెంట్లకు ఒకే సంఖ్యను ఇచ్చి చివరిలో ప్లాట్‌ నం బరు జోడించడానికి కసరత్తులు చేస్తున్నారు. ఇంటికి కేటాయించిన డిజి టల్‌ నంబర్‌ ఇంటర్‌ నెట్‌లో నమోదు చేయడం వల్ల భవిష్యత్తులో గూగు ల్‌ మ్యాప్‌ ద్వారా మార్గం చూపించే వీలు కలుగుతుందని భావిస్తు న్నారు. 

తికమకలకు తావు లేకుండా...

ప్రస్తుతం మున్సిపాల్టీల పరిధిలో వార్డుల ఆధారంగా ఇంటి నంబర్లను మొదటి అంకెతో మొదలై మద్యలో అడ్డగీత తర్వాత ఇంటి నంబర్లు ఉం టున్నాయి. పెరిగిన నివాస గృహాల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని, ఉన్న నంబర్లకే బై నంబర్లు ఇచ్చారు. ఇంటి బై నంబర్లు పెరగడంతో పరిస్థితి గందరగోళంగా తయారైంది. పక్క పక్క ఇళ్లు ఉన్నప్పటికీ ఇంటి నంబర్లు మాత్రం క్రమబద్ధంగా ఉండడం లేదు. దీంతో రోజురోజుకూ పెరుగుతున్న జనాభా, నివాసాల సంఖ్యతో పట్టణాల్లో ఇళ్ల చిరునామా తెలుసుకోవడం కష్టంగా మారింది. ఈనేపథ్యంలో కోడ్‌ల ప్రామాణికంగా డిజిటల్‌ నంబ ర్లు రూపొందించనున్నారు. భువన్‌ యాప్‌లో ఇళ్లకు సంబంధించిన జా బితాలు సిద్ధంగా ఉన్నాయి. వీటి ఆధారంగానే డిజిటల్‌ నంబర్లను ఇళ్లకు కేటాయించనుండడంతో ప్రక్రియ సులువుగా మారి గందరగోళానికి స్వస్తి పలకనున్నారు. 

ఇంటర్‌ నెట్‌తో అనుసంధానం...

మున్సిపాల్టీల్లో ఇంటి నంబర్లను డిజిటల్‌ విధానంలో కేటాయిస్తుండ డం వల్ల బహుళప్రయోజనాలు కలుగనున్నాయి. డిజిటల్‌ నంబర్లను ఇ వ్వడం వల్ల ప్రజలకు పలు సదుపాయాలు కలగనున్నాయి. డిజిటల్‌ నం బరు కేటాయించిన ప్రతీ ఇంటికి గూగుల్‌ మ్యాప్‌తో అనుసంధానం చే యనున్నారు. తద్వారా మొబైల్‌పై ఆన్‌లైన్‌లో గూగుల్‌ మ్యాప్‌ ఓపెన్‌ చేసి చిరునామా నమోదు చేస్తే ఎంచుకున్న ఇంటికి సురక్షితంగా, సుల భంగా వెళ్లే వీలు కలుగుతుంది. ఇంటింటికి ఇంగ్లీష్‌ అక్షరాలతో కూడిన డిజిటల్‌ నంబరు ప్లేట్లు అందనున్నాయి. నంబరు ప్లేట్‌పై క్యూఆర్‌ కోడ్‌ కూడా ముద్రించడం ద్వారా భవిష్యత్తులో ఇంటి పన్ను చెల్లింపులు, నల్లా పన్ను చెల్లింపులు, బకాయిలు ఇట్టే తెలుసుకునే వీలు కలుగుతుంది. 

ప్రభుత్వ ఆదేశాల మేరకే...

- స్వరూప రాణి, మున్సిపల్‌ కమిషనర్‌, జగిత్యాల

మున్సిపాల్టీల్లో ఇళ్లకు డిజిటల్‌ నంబర్ల కేటాయింపు ప్రక్రియను ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహించనున్నాము. ప్రభుత్వం జారీ చేయనున్న మార్గదర్శకాల ప్రకారం ఇంటి నంబర్ల కేటాయింపును పకడ్బందీగా పూర్తి చేస్తాము.

పాలన మరింత సులభంగా...

- అన్నం లావణ్య, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌, కోరుట్ల

ముఖ్యమంత్రి కేసీఆర్‌, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ల నేతృత్వంలో రాష్ట్రంలో పాలన పారదర్శకంగా, సులభతరంగా జరుగుతోంది. ఇందులో భాగంగానే మున్సిపాల్టీల్లో ఇళ్లకు డిజిటల్‌ నంబర్ల కేటాయింపును నిర్వహించనున్నాము.

Updated Date - 2022-06-26T05:53:34+05:30 IST