పేరుపాలెం బీచ్‌లో సందడి

ABN , First Publish Date - 2021-03-08T05:10:21+05:30 IST

దట్టమైన పొగమంచు ఉదయం 9గంటల వరకు అలుముకుని ఉంది.

పేరుపాలెం బీచ్‌లో సందడి
పేరుపాలెం తీరంలో సందర్శకులు

మొగల్తూరు, మార్చి7: దట్టమైన పొగమంచు ఉదయం 9గంటల వరకు అలుముకుని ఉంది. ఆపై భగ్గుమంటున్న ఎండ తీవ్రత.. ఆదివారం సెలవు దినం కావడంతో పేరుపాలెం సాగర తీరం సందర్శకులతో కిటకిటలాడింది. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి ఆదివారం విద్యార్థులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున పేరుపాలెం సాగర తీరానికి చేరుకున్నారు. సముద్ర స్నానం అనంతరం తీరం వెంబడి కొబ్బరి, సరుగుడు తోటల్లో చల్లని గాలి ఆస్వా దిస్తూ ఎండ తీవ్రత తగ్గేవరకూ గడిపారు.

Updated Date - 2021-03-08T05:10:21+05:30 IST