పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోన్న డ్రాగన్‌

ABN , First Publish Date - 2021-11-11T05:30:00+05:30 IST

ఈ చిత్రం చూడండి. ఒకటి, రెండు కాదు... మూడు తలల డ్రాగన్‌ ఎలా మంటలు కక్కుతూ వస్తోందో...

పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోన్న డ్రాగన్‌

ఈ చిత్రం చూడండి. ఒకటి, రెండు కాదు... మూడు తలల డ్రాగన్‌ ఎలా మంటలు కక్కుతూ వస్తోందో! ఇప్పుడు డ్రాగన్‌లు ఎక్కడున్నాయి అంటారా? ఇది నిజమైన డ్రాగన్‌ కాదు. పర్యాటకులను ఆకర్షించడానికి ఏర్పాటు చేసిన బొమ్మ అది. ఆ విశేషాలు ఇవి...


రష్యాలోని కామెంకా అనే గ్రామ శివారులో కుడికిన గోరా పేరుతో ఒక పార్కు ఉంది. ఆ పార్కులో ప్రత్యేక ఆకర్షణ మూడు తలల డాగ్రన్‌ బొమ్మ. ఎంత రియలిస్టిక్‌గా ఉంటుందంటే మొదటి సారి చూసిన వారు నిజమైన డ్రాగన్‌ వచ్చిందేమో అని భయపడుతుంటారు.


పదిహేను మీటర్ల ఎత్తుతో నిజమైన డ్రాగన్‌ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. ఉక్రెయిన్‌కు చెందిన శిల్పి వ్లాదిమిర్‌ కొలెస్నికోవ్‌ దీన్ని రూపొందించారు. ఇనుము, కాంక్రీట్‌తో దీన్ని తయారు చేశారు. ఇందులో మరో ప్రత్యేకత ఏమిటంటే అప్పుడప్పుడు డ్రాగన్‌ నోట్లో నుంచి మంటలు వస్తుంటాయి. దీనివల్ల నిజమైన డ్రాగన్‌ను చూసిన భావన కలుగుతుంటుంది. ఇది ఏర్పాటు చేసిన తరువాత ఇక్కడికొచ్చే పర్యాటకుల సంఖ్య చాలా పెరిగింది. ఫోటోలు సోషల్‌ మీడియాలో పెట్టడంతో మిలియన్ల కొద్దీ లైక్‌లు వచ్చాయి.

Updated Date - 2021-11-11T05:30:00+05:30 IST