మైపాడు బీచ్‌లో పర్యాటకుల సందడి
ఇందుకూరుపేట, జనవరి 16 : మైపాడు బీచ్ పర్యాటకుల సందడి నెలకొంది. ఉదయం నుంచి పలు ప్రాంతాల నుంచి సముద్ర ప్రేమికులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఆదివారం కనుమ పండుగ సందర్భంగా బీచ్ వాతావరణంలో సందడి నెలకొంది. చినుకులు పడుతున్నా చల్లటి వాతావరణం ఉన్నా పర్యాటకులు సముద్ర తీరాన సేద తీరారు. తీరంలో ఆట పాటలతో ఉదయం నుంచి యువత మొదలు పెద్ద తరం కూడా ఇక్కడ పండుగ ఆస్వాదిస్తూ గడిపారు.